ఎలాన్ మస్క్ సింపుల్ లైఫ్… సూపర్ గోల్స్ …
సహనం వందే, అమెరికా:ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి. టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్ (ట్విట్టర్) వంటి దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవనశైలి ఎందరికో ఆదర్శం. రూ. 35 లక్షల కోట్లకుపైగా ఆస్తులు ఉన్నప్పటికీ… ఆయన విలాసవంతమైన జీవితానికి దూరంగా, అత్యంత సాధారణంగా జీవించడం విశేషం. సంపదను వ్యక్తిగత విలాసాలకు కాకుండా, మానవాళి భవిష్యత్తును మెరుగుపరచే తన వెంచర్ల అభివృద్ధికి వినియోగించడమే మస్క్ ప్రధాన లక్ష్యం. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి….