ద’క్షీణ’ భారతం – దక్షిణాది సీట్ల అవసరం లేకుండానే ఢిల్లీ పీఠం
సహనం వందే, హైదరాబాద్: దేశంలో దక్షిణాది రాష్ట్రాల రాత మాత్రం మారడం లేదు. మనం రెక్కలు ముక్కలు చేసుకుని దేశానికి అన్నం పెడుతుంటే… ఎవరో వచ్చి ఆ పళ్లెం లాక్కుని వెళ్లే కుట్ర ఇది. అభివృద్ధికి మనం నిచ్చెనలవుతుంటే… ఆ నిచ్చెన మెట్లు ఎక్కి పీఠం ఎక్కేది మాత్రం ఉత్తరాది నేతలే. ఇది కేవలం సీట్ల పెంపు కాదు… దక్షిణాది ఆత్మగౌరవంపై జరుగుతున్న సర్జికల్ స్ట్రైక్. ప్రజాస్వామ్యం అంటే కేవలం తలల లెక్కింపేనా? తెలివితేటలకు, కష్టానికి విలువ…