
నెంబర్ అడగొద్దు… కస్టమర్స్ చెప్పొద్దు – ఇక మొబైల్ నెంబర్లు అడగడం నేరమే!
సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో డిజిటల్ యుగం విస్తరిస్తున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అమలులోకి రానున్న నూతన డేటా రక్షణ చట్టం ప్రకారం రిటైల్ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారుల మొబైల్ నెంబర్లను అడగడం నేరంగా పరిగణించబడుతుంది. ఇప్పటివరకు దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్ ప్రక్రియలో మొబైల్ నెంబర్లు సేకరించడం ఒక…