
సిగిరెట్టు ఎంతో సమోసా అంతే – కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాలు
సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో స్థూలకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవనశైలి వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సమోసా , జిలేబీ, పకోడా, వడపావ్, ఛాయ్ బిస్కెట్లు వంటి అధిక కొవ్వు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలపై సిగరెట్ల తరహా ఆరోగ్య హెచ్చరికలు ప్రదర్శించనుంది. ప్రజల్లో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం. ఈ వినూత్న ప్రచార…