
భూమి కోసం బెజవాడ గర్జన – అన్నదాత ఆగ్రహం… ప్రభుత్వ దౌర్జన్యం
సహనం వందే, విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి. చంద్రబాబు నాయుడు సర్కారు అనుసరిస్తున్న దమననీతిని నిరసిస్తూ బెజవాడ వీధుల్లో రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజా సంఘాలు పోటెత్తాయి. తమ జీవనాధారాన్ని బలవంతంగా లాక్కుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ఒక్కతాటిపైకి వచ్చి నినదించారు. భూమిని అమ్మేవారుగా కాకుండా, భూమిని నమ్ముకున్న రైతులుగా తమ హక్కును నిలబెట్టుకోవడానికి ఈ గర్జన ప్రారంభమైంది. ప్రభుత్వ దౌర్జన్యానికి వ్యతిరేకంగా వీధుల్లో మార్మోగిన నినాదాలు, రాష్ట్రంలో నెలకొన్న…