అతిథి దేవో… భద్రత లేదో – ఇండోర్ లో విదేశీ మహిళా క్రికెటర్లకు వేధింపులు
సహనం వందే, ఇండోర్:క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడటానికి భారత్‌కు వచ్చిన విదేశీ మహిళా క్రీడాకారులకు భద్రత కరువైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ మహిళా ప్రపంచకప్ సందర్భంగా ఇండోర్ లో బస చేసిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లను ఓ మతిలేని వ్యక్తి వేధించడం దేశంలో మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య గ్రూప్ దశ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజు గురువారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హోటల్ నుంచి ఓ…