
డబ్బుల్ పెండింగ్… ఆసుపత్రులు క్లోజింగ్ – ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల అల్టిమేటం
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకంలో సేవలు అందిస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తామని తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఫర్ ఆరోగ్యశ్రీ (తాన్హా) అధ్యక్షులు డాక్టర్ వద్దిరాజు రాకేష్ హెచ్చరించారు. . ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్) లాంటి పథకాల్లో సేవలు అందించడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్…