
ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ – అర్ధరాత్రి నుంచి వైద్య సేవలు బంద్
సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులు ఆదివారం అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపి వేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన 1300 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ పరిణామం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు చేసినందుకు తమకు రావాల్సిన బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నెట్వర్క్ ఆసుపత్రులు చాలా…