విజయనగరం వీరుడు… పార్లమెంట్ టాపర్
సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటులో టాపర్ గా నిలిచారు. ప్రశ్నలు, హాజరు విభాగాల్లో ఎంపీలందరితో పోలిస్తే మొదటి స్థానం సాధించారు. మొత్తం పని తీరులో నాలుగో స్థానం వచ్చింది. 99 శాతం హాజరు, 115 ప్రశ్నలతో ముందుండటం అతని అంకితభావాన్ని తెలియజేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీలలో అత్యుత్తములలో ఒకరిగా నిలవడం తెలుగుదేశం పార్టీకి గొప్ప గుర్తింపు. లోక్‌సభ సభ్యుల పనితీరు నివేదికను పార్లమెంట్ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025…