శాంతి దూతగా రోత దేశం – పాకిస్తాన్ లో అమెరికా- ఇరాన్ చర్చలు నేడే
సహనం వందే, హైదరాబాద్: ఉగ్రవాదానికి ఊపిరిపోస్తూ ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్ ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య మధ్యవర్తిగా అవతరించడం అంతర్జాతీయ దౌత్య చరిత్రలోనే అతిపెద్ద ప్రహసనం. వేల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలిగొన్న యుద్ధాన్ని ఆపే నెపంతో ఇస్లామాబాద్‌ను శాంతి కేంద్రంగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం అమెరికా తన స్వార్థం కోసం భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశాల ప్రయోజనాలను పక్కన పెట్టి చేస్తున్న ప్రమాదకర ప్రయోగం. ఉగ్ర నిలయంలో దౌత్య వేడుకఒకప్పుడు ఒసామా బిన్…