శవాల మధ్య డాలర్ దర్జా – యుద్ధ మంటల్లో అమెరికా కరెన్సీ ధగధగ
సహనం వందే, హైదరాబాద్: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అవుతుంటే, అమెరికా డాలర్ మాత్రం తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా డాలర్‌ను భావించి పరుగులు తీస్తుండటంతో అగ్రరాజ్యం కరెన్సీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆపద కాలంలో ఆదుకుంటాయనుకున్న ఇతర సురక్షిత పెట్టుబడులన్నీ నీరుగారిపోయాయి. ఈ వికృత ఆర్థిక అసమతుల్యత ఇప్పుడు అగ్రరాజ్యం ఆధిపత్యానికి తిరుగులేని ఆయుధంగా మారింది. డాలర్ ఎందుకు పెరుగుతుంది?యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతింటాయనే భయం ఉంటుంది. ఇలాంటి…