
బేడీలపై వేడి – గద్వాల్లో రైతుల చేతికి సంకెళ్లు
సహనం వందే, హైదరాబాద్:రైతుల పట్ల పోలీసుల వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది. అనేక సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలకే అన్నదాతలకు సంకెళ్లు వేసి వారిని ఈడ్చుకొని వెళ్లడం దాష్టీకానికి పరాకాష్ట. తాజాగా జోగులాంబ గద్వాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సంకెళ్లు వేసి, నేరస్తుల్లా కోర్టుకు తరలించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు కారణమైంది. ఈ సంఘటనపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ… జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావును నిలదీశారు. బేడీలు…