
బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వర్సెస్ రేవంత్ రెడ్డి
సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన దావరి-బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో, దీనిని అడ్డుకోకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని…