
గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ లో పెద్దలెక్కడ?
సహనం వందే, హైదరాబాద్:సినిమా పరిశ్రమకు తామే పెద్దలమని చెప్పుకుంటారు. కళామతల్లి బిడ్డలమని డబ్బా కొట్టుకుంటారు. పొద్దున్న లేస్తే నీతి కబుర్లు చెబుతుంటారు. పైనుంచి దిగివచ్చిన దేవదూతలుగా భావిస్తుంటారు. అలాంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ కు హాజరు కాకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో ఉంటూ… ఇక్కడి భూములపై రాయితీలు అనుభవిస్తూ… సినిమా టిక్కెట్లకు ధరలు పెంచుకుంటూ వందల వేల కోట్లకు పడగలెత్తిన మన కళామతల్లులు…