
తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై వివ(క)క్ష
సహనం వందే, హైదరాబాద్:ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అవమాన భారం మోస్తున్నారు. జీతం తక్కువ… ఛీత్కారాలు ఎక్కువ. నిబద్ధతతో సేవ చేస్తున్నప్పటికీ అవమానంతో మనుగడ సాగిస్తున్నారు. ఎలాంటి కారణం లేకుండా… కనీసం విచారణ, నోటీసు లేకుండా ఒక సాధారణ ఫోన్ కాల్ ద్వారా తొలగిస్తున్నారు. వేతనంతో కూడిన సెలవు లేదు. వీరి కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధుల్లో 25-30% ఏజెన్సీలు తినేస్తున్నాయి. తెలంగాణలో రెండు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సరైన వేతనాలు లేక అర్ధాకలితో జీవితాలను నెట్టుకొస్తున్నారు….