Supreme Court Judgement on OBC Non Creamy Layer Reservations

సివిల్స్ ఎంపికల్లో మారిన లెక్కలు – నాన్ క్రీమీలేయర్ పరిమితిపై సుప్రీం సంచలన తీర్పు

సహనం వందే,న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం కష్టపడే వేలాది మంది ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలక ప్రకటన చేసింది. నాన్ క్రీమీలేయర్ పరిమితిపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పునఃపరిశీలన పిటిషన్‌పై ఈ నెల 6వ తేదీన సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, తన మార్చి 11 నాటి తీర్పును మరోసారి పునరుద్ఘాటించింది. ఈ నిర్ణయంతో సివిల్స్ ఉద్యోగాల కేటాయింపులు, రిజర్వేషన్ల అర్హతలపై నెలకొన్న ఉత్కంఠకు స్పష్టత వచ్చింది….

Read More
AP Alliance Sunami

ఏపీలో కూటమి సునామీ – జడ్పీటీసీల్లో కూటమి భారీ విజయం

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పోరులో అధికార కూటమి ఊహించని రీతిలో సత్తా చాటింది. మొన్నటి వరకు రాష్ట్రాన్ని ఏలిన ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ ఫలితాలు మింగుడుపడడం లేదు. గ్రామస్థాయిలో జరిగిన ఈ ఎన్నికల పోరులో ప్రజలు ఎవరి వైపు నిలబడ్డారనే విషయం వెల్లడవుతోంది. జడ్పీటీసీ బరిలో కూటమి క్లీన్‌స్వీప్రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జడ్పీటీసీ ఎన్నికల…

Read More
JNTU Former Registrar Scams

సీబీఐ వలలో జేఎన్టీయూ – కోట్ల కుంభకోణం… ఉలిక్కిపడిన యూనివర్సిటీ

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో పేరుమోసిన ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యాసంస్థ హైదరాబాద్ జేఎన్టీయూలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. యూనివర్సిటీలో జరుగుతున్న నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను ఉల్లంఘనలు, పరిపాలనాపరమైన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఫిర్యాదు అందింది. కె.పి. భాగ్య వెంకట కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదును నేరుగా ఢిల్లీలోని సీబీఐకి సమర్పించారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రమోషన్లలో నిబంధనల…

Read More
AMerica Interim Elections Muslims Hawa

అమెరికా రాజకీయాల్లో ముస్లిం శకం – మధ్యంతర ఎన్నికల్లో సంచలన విజయాలు

సహనం వందే, అమెరికా: అమెరికా దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఒక వర్గానికి మాత్రమే పరిమితం అనుకున్న రాజకీయాల్లో ఇప్పుడు ముస్లిం నాయకులు, ఓటర్లు కీలక శక్తిగా మారుతున్నారు. అక్కడి రాజకీయ సమీకరణాలను పూర్తిగా తలకిందులు చేసేలా ఈ ఎదుగుదల సాగుతోంది. దీనిని కేవలం ఒక యాదృచ్ఛిక పరిణామంగా చూడలేమని, అమెరికన్ సమాజంలో ఇది ఒక బలమైన అడుగు అని పరిశీలకులు భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికల్లో ముస్లింల…

Read More
iphone Portable fail

లక్షల వెల.. కెమెరా వెలవెల – యాపిల్ “మడత” పేచీ

సహనం వందే, హైదరాబాద్: టెక్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తెస్తామంటూ గొప్పలు చెప్పుకునే యాపిల్ సంస్థ, ఎంతో ఆర్భాటంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. సామ్‌సంగ్, గూగుల్ లాంటి ఆండ్రాయిడ్ దిగ్గజాలు మార్కెట్లో ఏడేళ్లుగా ఫోల్డబుల్ ఫోన్ల టెక్నాలజీలో దూసుకుపోతుంటే, యాపిల్ మాత్రం ఏడేళ్లపాటు హోమ్‌వర్క్ చేసి మరీ తీసుకొచ్చిన ఈ డివైస్‌లో కనీస హంగులు కూడా లేకపోవడం టెక్‌ నిపుణులను విస్మరిస్తోంది. ముఖ్యంగా కెమెరా సెటప్,…

Read More
EV Vehicles

ఇన్వర్టర్ టెక్నాలజీతో ఈవీ మ్యాజిక్ – ఎలక్ట్రిక్ వాహనదారులకు అల్టిమేట్ గుడ్ న్యూస్

సహనం వందే, హైదరాబాద్: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతున్నప్పటికీ, చార్జింగ్ సదుపాయాలు అందరికీ అందుబాటులో లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా సొంతంగా ప్రైవేట్ పార్కింగ్ స్థలం లేని వారి పరిస్థితి వర్ణనాతీతం. అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి, ఇళ్ల ముందు పార్క్ చేసే వారికి రాత్రిపూట వాహనాన్ని ఎలా చార్జ్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈవీ మొబిలిటీ విజయం సాధించాలంటే రోజువారీ డ్రైవింగ్ అలవాట్లకు సరిపోయేలా ఈ నెట్‌వర్క్ రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇన్వర్టర్…

Read More
Rmayan movie Updaters

రామాయణానికి మోడర్న్ టచ్ – వెండి తెరపై విజువల్స్ మ్యాజిక్!

సహనం వందే, హైదరాబాద్: పురాణాలను వెండితెరపై ఆవిష్కరించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ప్రేక్షకుల గుండెల్లో దశాబ్దాలుగా నాటుకుపోయిన పాత్రలను చెక్కుచెదరకుండా చూపిస్తూనే, నేటి తరానికి నచ్చేలా టెక్నాలజీని జోడించడం చాలా కష్టమైన పని. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రామాయణ చిత్రం ఇదే కోవలోకి వస్తుంది. ఈ భారీ ఎపిక్ యాక్షన్-అడ్వెంచర్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టెక్నాలజీతో సరికొత్త ప్రయోగంనితేశ్ తివారీ ఈ…

Read More
Guru Dheerendra Sastry Comments on Lord Krishna

కృష్ణుడిపై వంకర టింకర మాటలు – ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలు

సహనం వందే, బీహార్: రాజకీయ రంగంలో ఒక్కోసారి చోటుచేసుకునే వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కిస్తాయి. తాజాగా బీహార్ రాజకీయాల్లో ఇలాంటి పరిణామమే కనిపిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి శ్రీకృష్ణుడిపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించడంతో ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సన్యాసులు, భక్తుల అభ్యంతరం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ధీరంద్ర కృష్ణ శాస్త్రి మాట్లాడుతూ శ్రీరాముడిని,…

Read More
Sabari Portal

వన్ క్లిక్ శబరి పోర్టల్ – స్మార్ట్‌ఫోన్‌తో సురక్షిత శబరిమల ప్రయాణం

సహనం వందే, కేరళ: క్యూ లైన్ల గందరగోళం, ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, క్షణం క్షణం పెరిగే రద్దీ… శబరిమల అనగానే ప్రతి భక్తుడికీ గుర్తొచ్చే కష్టాలివి. ఏటా తరలివచ్చే కోట్లాది మంది ఇబ్బందులను గమనించిన కేరళ ప్రభుత్వం, ఈసారి సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ‘వన్ క్లిక్ శబరి’ అనే సమగ్ర డిజిటల్ పోర్టల్‌ను రంగంలోకి దించింది. సమాచారం కోసం వేర్వేరు యాప్‌లు వెతికే పనిలేకుండా, అత్యవసర సేవలన్నింటినీ ఒకే గొడుగు…

Read More
Gen Z Book Reading

జెన్ జెడ్ బుక్ రీడింగ్ – మారుతున్న నేటి తరం… పుస్తకమే లోకం

సహనం వందే, హైదరాబాద్: నేటి డిజిటల్ యుగంలో యువత కేవలం సోషల్ మీడియా, రీల్స్ కే పరిమితమవుతున్నారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఆ ఆలోచనను తలకిందులు చేస్తూ జెన్ జెడ్ తరం పుస్తక పఠనం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ వేదికగా నేషనల్ బుక్ ట్రస్ట్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతీయ యువత పఠన అలవాట్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కేవలం అకడమిక్, సిలబస్ పుస్తకాలకే పరిమితం…

Read More