ఆక్రమిత స్థలాలకు లైన్ క్లియర్ – ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలోని నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే వార్త అందించింది. సొంత స్థలం ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ కాక, తమ ఆస్తి ఏ క్షణంలో 22ఏ జాబితాలోకి వెళ్తుందోనని ఆందోళన చెందుతున్న పౌరులకు ఇది గొప్ప ఉపశమనం. జీఓ నెంబర్ 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్లుగా ఎదురుచూస్తున్న 500 చదరపు గజాలు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న స్థలాల పెండింగ్ దరఖాస్తులను కేవలం నెల…