నీటి హిస్టరీ… వీడింది మిస్టరీ – నివ్వెర పరుస్తున్న నాసా అధ్యయనం
సహనం వందే, అమెరికా: అనంత విశ్వంలో భూమిపై మాత్రమే నీరు ఎలా వచ్చింది? మన సముద్రాలు ఎలా నిండాయి? ఈ ప్రశ్నలకు వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు సమాధానాలు వెతుకుతున్నారు. తాజాగా నాసా చేపట్టిన అధ్యయనంలో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. కోట్ల ఏళ్ల కిందట అంతరిక్షం నుంచి కురిసిన గ్రహశకలాల వర్షమే భూమిని జలమయంగా మార్చిందని… తద్వారా జీవం పుట్టుకకు పునాది పడిందని పరిశోధకులు విశ్లేషించారు. అంతరిక్షం నుంచి ఆగమనంపుట్టిన కొత్తలో భూమి కేవలం అగ్నిగోళంలా ఉండేది….