సువాసనల చాటున స్మశానాల వాసన – జాన్సన్ అండ్ జాన్సన్ మరణశాసనం
సహనం వందే, లండన్: తల్లి ప్రేమకు ప్రతిరూపంగా, పసిబిడ్డల సుగుణాల రాశిగా ముద్రవేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ బ్రాండ్ ఇప్పుడు మరణశాసనంగా మారింది. దశాబ్దాల కాలంగా నమ్మకమే పెట్టుబడిగా సాగిన వ్యాపారం వెనుక భయంకరమైన క్యాన్సర్ నిజాలు దాగున్నాయనే ఆరోపణలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పౌడర్ డబ్బాలో సువాసనల వెనుక మృత్యువు దాగి ఉందనే బాధితుల గొంతుక ఇప్పుడు బ్రిటన్ హైకోర్టు హాల్‌లో గర్జిస్తోంది. అంతర్జాతీయ కేసు…బ్రిటన్ న్యాయ చరిత్రలోనే ఇది అతిపెద్ద హెల్త్ ప్రొడక్ట్ కేసుగా నిలవనుంది….