ఫోన్ లేని కొత్త లోకం… స్క్రీన్లు లేని స్మార్ట్ యుగం
(బొల్లోజు రవి, హైదరాబాద్) మనం రోజుకు సగటున 200 సార్లు స్మార్ట్ ఫోన్‌ను చూస్తున్నాం. ఈ వ్యసనం నుండి బయటపడేయడమే లక్ష్యంగా సిలికాన్ వ్యాలీ స్క్రీన్ లెస్ విప్లవానికి తెరలేపింది. చేతిలో ఫోన్ పట్టుకుని నిరంతరం తలవంచుకుని తిరిగే కాలం ముగియనుంది. కళ్లద్దాలు, ఉంగరాలు, ఎయిర్‌పాడ్స్ ద్వారానే ఏఐ మన పనులన్నీ చక్కబెట్టే రోజులు మొదలయ్యాయి. నోటిఫికేషన్ల నుండి విముక్తి…సామ్ ఆల్ట్మాన్ అభివృద్ధి చేస్తున్న ఏఐ పరికరం ఫోన్ల రద్దీ నుండి మనల్ని కాపాడుతుంది. ప్రస్తుత స్మార్ట్ఫోన్లలో…