అస్తిత్వ పోరాటపు అంచున దక్షిణాది – భారత్‌లో తీవ్రమైన ప్రాంతీయ అసమానతలు
సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ప్రస్తుతం ఒక విలక్షణమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా దూసుకుపోతుంటే… ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా పట్టు బిగిస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య పెరుగుతున్న సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు దేశ సమగ్రతకు సవాలుగా మారాయి. ఈ సున్నితమైన అంశంపై జాతీయ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ది హిందూలో కాంగ్రెస్ నేత శశి ధరూర్ రాసిన కథనం సంచలనం సృష్టిస్తుంది. ఆ స్టోరీలోని కొన్ని కీలకమైన విషయాలు ఇక్కడ చూడవచ్చు….