దిష్టి కళ్ళపై అగ్నిజ్వాలలు – పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని నేతల డిమాండ్
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. అంతేకాదు… ‘తెలంగాణ ప్రజల దిష్టి కాదు… ఆంధ్రా పాలకుల వల్లనే ఫ్లోరైడ్ విషం తాగారు’ అంటూ పవన్ వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టారు. ‘మంత్రి…