
మీడియాపై నరమేధం – యెమెన్‌లో 31 మంది జర్నలిస్టుల మృతి
సహనం వందే, న్యూఢిల్లీ:మధ్యప్రాచ్యంలో జర్నలిస్టుల భద్రతకు మరోసారి పెనుముప్పు పొంచి ఉంది. యెమెన్‌లో ఒక వార్తాపత్రిక కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 31 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టుల రక్షణ కమిటీ (కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్) నివేదిక ప్రకారం… జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన అతి పెద్ద దాడి ఇదే. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఈ దాడిని హౌతీ తిరుగుబాటుదారుల మీడియా కేంద్రంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బందిని…