మేకప్పు మహాగబ్బు – ముఖానికి మలమూత్ర క్రీమ్
సహనం వందే, హైదరాబాద్: మీరు ముఖానికి రాసుకునే ఖరీదైన క్రీమ్… అందాన్ని ఇచ్చే సౌందర్య సాధనం కాదు అచ్చమైన అశుద్ధం. అవును ఆన్లైన్ లో తక్కువ ధరకు దొరికే బ్రాండెడ్ మేకప్ సామాగ్రిలో మానవ విసర్జితాలు, మూత్రం, ఎలుకల మలమూత్రాలు ఉన్నట్లు దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్న ఇ-కామర్స్ దిగ్గజాలు.. యువత ప్రాణాలను విషపూరిత రసాయనాలకు తాకట్టు పెడుతున్నాయి. అందం కోసం చేసే ఆరాటం కాస్తా ఆసుపత్రి పాలయ్యేలా చేస్తున్న…