దేశ చరిత్రలో ‘అమరావతి’కే చట్టబద్ధత – ఇతర రాష్ట్ర రాజధానులకు లేని ప్రత్యేక చట్టం
సహనం వందే, అమరావతి: దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధాని కోసం పార్లమెంటులో ప్రత్యేకంగా చట్ట సవరణ చేయడం ఇదే మొదటిసారి. గతంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వాటి రాజధానుల విషయంలో ఇంతటి న్యాయపోరాటం లేదా రాజకీయ అనిశ్చితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వివాదంతో అమరావతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ తెచ్చి అమరావతిని శాశ్వత రాజధానిగా ముద్ర వేసింది….