‘ప్యారడైజ్’లో జడల్ తిరుగుబాటు – ది ప్యారడైజ్ సినిమాలో నాని ఉగ్రరూపం

Paradise Movie updates
  • శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో యాక్షన్ సీన్స్
  • అనిరుధ్ సంగీతంతో చిత్రంపై భారీ అంచనాలు
  • మోహన్ బాబు కీలక పాత్రతో సినిమాకు హైప్
  • సెప్టెంబర్ 24న విడుదల

సహనం వందే, హైదరాబాద్:

సినిమా తెరపై హీరోల మాస్ మేకోవర్లు ఎప్పుడూ సంచలనం సృష్టిస్తాయి. ఇప్పుడు అదే కోవలో టాలీవుడ్ బాక్సాఫీస్ ను గడగడలాడించడానికి మరో భారీ యాక్షన్ డ్రామా సిద్ధమైంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మరోసారి వస్తుండటంతో ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించే అంచనాలు నెలకొన్నాయి.

బాక్సాఫీస్ పై దండయాత్ర
తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ది ప్యారడైజ్ సినిమా గురించే జోరుగా చర్చ జరుగుతోంది. టాలెంటెడ్ హీరో నాని నటిస్తున్న ఈ తాజా చిత్రానికి గతంలో బ్లాక్ బస్టర్ ఇచ్ఛిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే టాలీవుడ్‌లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ భారీ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 24 తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ చిత్రం ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

The Paradise Movie

రగ్డ్ అవతార్‌లో జడల్
రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. టీజర్ చూస్తుంటేనే ఇది మామూలు సినిమా కాదని ఒక రేంజ్ యాక్షన్ డ్రామా అని స్పష్టంగా అర్థమవుతోంది. దసరా సినిమాలో తెలంగాణ బొగ్గు గనుల నేపథ్యంలో నానిని ఒక రగ్డ్ అండ్ రా అండ్ రస్టిక్ అవతార్‌లో చూశాము. కానీ ఈసారి ది ప్యారడైజ్ చిత్రంలో నానిని అంతకంటే చాలా ఫీర్స్‌గా అత్యంత శక్తివంతమైన రూపంలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు జడల్ అని టీజర్ ద్వారా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

భూమి కోసం భీకర పోరాటం
ఈ చిత్ర కథాంశం కేవలం సాధారణ కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా ఒక బలమైన సామాజిక అంశాన్ని స్పృశించబోతోంది. సమాజంలో జరిగే అణచివేతకు వ్యతిరేకంగా తమ గుర్తింపును కాపాడుకోవడం కోసం అలాగే భూమి కోసం సాగే ఒక భీకరమైన పోరాటమే ఈ సినిమా ప్రధాన కథ. జడల్ పాత్ర ద్వారా నాని చేసే రిబెలియన్ లేదా తిరుగుబాటు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం.

భారీ తారాగణం హవా
ఈ చిత్రంలో నానితో పాటు టాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ బాబు ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే విలన్ పాత్రలో రాఘవ్ జుయల్ నటిస్తుండగా ఆయన లుక్స్, నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక కథానాయికగా కయాదు లోహర్ నటిస్తుంది. ఈ నటీనటుల కలయిక సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

సెన్సేషనల్ మ్యూజిక్ మ్యాజిక్
సినిమా విజయానికి సంగీతం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అనిరుధ్ ఇస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కే ప్రాణం పోసిందని చెప్పవచ్చు. థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిరుధ్ బీజీఎం ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వకుండా ఉర్రూతలూగిస్తుందనే చెప్పాలి. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా టాప్ నాచ్‌లో ఉండబోతోంది. సినిమాటోగ్రాఫర్‌గా సి. సై పని చేస్తుండగా ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్ల వ్యవహరిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *