Tag: #latestnews
వీసమెత్తు పనికిరానివారికి వీసా – అమెరికాలో హైదరాబాద్ పరువు గంగపాలు
సహనం వందే, హైదరాబాద్/చెన్నై: అమెరికా వెళ్లేందుకు తీసుకునే వీసా ప్రక్రియలో భారీగా మోసాలు జరిగాయని ఒక దౌత్యవేత్త సంచలన ఆరోపణలు చేశారు. భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా వ్యవస్థలోని అక్రమాలను ఒక అమెరికన్-భారతీయ దౌత్యవేత్త మహ్వాష్ సిద్ధిఖీ బట్టబయలు చేశారు. వీసాల కోసం వచ్చే దరఖాస్తులలో దాదాపు 70 నుంచి 90 శాతం వరకు నకిలీవి అని… ఈ వ్యవస్థ ఒక కుంభకోణంగా మారిందని మహ్వాష్ సిద్ధిఖీ ఆరోపణలు చేశారు. ఏమాత్రం నైపుణ్యం లేనివారు, నకిలీ…
రూపాయి ‘క్రాష్’తో ఆర్థిక విధ్వంసం – కాపాడే ఆర్థిక వైద్యులు ఎవరు?
సహనం వందే, ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ. 89.48 దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… దేశ ఆర్థిక శక్తికి అద్దం పట్టే చేదు నిజం. రూ. 90 అనే ముఖ్యమైన మార్క్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ మార్కెట్లోకి డాలర్లు అమ్మి రూపాయిని పైకి లేపే ప్రయత్నం చేసినా…
తల్లి పాలలో విషపు జాడలు – ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో దారుణ నిజాలు
సహనం వందే, బీహార్: పిల్లలకు అమృతం వంటి తల్లి పాలే ఇప్పుడు విషంగా మారిపోయాయి. పసికందుల నోటిలోకి పాలు కాదు… నిశ్శబ్దంగా యురేనియం వంటి ప్రాణాంతక విషాన్ని చేరుస్తున్న అత్యంత భయంకరమైన నిజాన్ని ఒక కొత్త అధ్యయనం బట్టబయలు చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి సేకరించిన తల్లి పాలలో యూరేనియం జాడలు కనిపించడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో… పౌరుల ప్రాథమిక ఆరోగ్య భద్రతకు ఎంత ముప్పు పొంచి ఉందో తెలియజేస్తోంది….
ఐటీ జోరు… ఎంబీఏ బేజారు – ఇండియా స్కిల్స్ రిపోర్ట్ – 2026 వెల్లడి
సహనం వందే, న్యూఢిల్లీ: నిజం మాట్లాడుకుందాం! జాబ్ మార్కెట్‌లో ఇప్పటికీ డిమాండ్ అంటే అది కంప్యూటర్ సైన్స్ (సీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) డిగ్రీలకే ఉంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ఏం చెబుతోందంటే… సీఎస్ గ్రాడ్యుయేట్లకు 80 శాతం, ఐటీ గ్రాడ్యుయేట్లకు 78 శాతం ఉద్యోగావకాశాలున్నాయి. అంటే నువ్వు ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వైపు అడుగులేస్తే నీ కెరీర్‌కి ఢోకా లేనట్టే! కంపెనీలు ఇప్పుడు కోడింగ్‌కి పరిమితమయ్యే టాలెంట్‌ని కాదు… ఇంజినీరింగ్‌తో పాటు…
దళిత ఐఏఎస్ బ్రాహ్మణులకు సవాల్ – పెళ్లి పీటలెక్కేవరకు రిజర్వేషన్లు మస్ట్
సహనం వందే, భోపాల్: రిజర్వేషన్లను కేవలం పేదరికంతో ముడిపెట్టి పదేపదే ప్రశ్నించే అగ్ర కులాలకు దళిత ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మ గట్టి సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించినా… ఆర్థికంగా నిలదొక్కుకున్నా ఈ సమాజం ఇంకా తనను సామాజికంగా అంగీకరించడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. అనుసూచిత్ జాతి-జనజాతి అధికారి కర్మచారి సంఘం (అజ్జాక్స్) రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన… రిజర్వేషన్లు ఎందుకు కొనసాగాలని ప్రశ్నించిన వారికి సూటిగా జవాబిచ్చారు. ‘ఒక బ్రాహ్మణుడు తన…
అలవెన్స్ లాక్… డాక్టర్ల షాక్ – టీజీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ నరహరి ఆవేదన
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో నూతనంగా స్థాపించిన మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా 10 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా… వాటిల్లో పనిచేస్తున్న వైద్యులకు ఇవ్వాల్సిన అదనపు అలవెన్స్ కేవలం 5 కళాశాలలకు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సంఘం నిప్పులు చెరిగింది. ప్రభుత్వమే విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులలో పది కళాశాలల ప్రస్తావన స్పష్టంగా ఉన్నప్పటికీ…
వేల కోట్లు మోసం… కోర్టు అభయం – 13 వేల కోట్ల మోసకారులకు సుప్రీం బిగ్ ఆఫర్
సహనం వందే, న్యూఢిల్లీ: బ్యాంకులను ముంచిన బిలియనీర్ సోదరులు నితిన్, చేతన్ సందేసరాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతుంది. దాదాపు రూ. 13 వేల కోట్ల బ్యాంకు మోసం కేసులో దేశం విడిచి పారిపోయిన నితిన్, చేతన్ ల పై సుప్రీంకోర్టు వేసిన బ్రేక్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. వేల కోట్లు కొల్లగొట్టిన వారికి అత్యున్నత న్యాయస్థానం ఊరటనిస్తూ మొత్తం అప్పులో మూడో వంతు చెల్లిస్తే క్రిమినల్ కేసులన్నీ రద్దు చేస్తామంటూ ఆదేశాలు ఇవ్వడం…
ఐ బొమ్మ అప్పారావు ‘మెగా’ వార్నింగ్ – సినిమా పరిశ్రమను ఉతికి ఆరేసిన రవి తండ్రి
సహనం వందే, హైదరాబాద్: ఐ బొమ్మ నిర్వాహకుడు రవి తండ్రి అప్పారావు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేయాలని సినీ నిర్మాత సి. కల్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యానించడంపై అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకును ఎన్‌కౌంటర్ చేసే అంత తప్పు ఏమీ చేయలేదని… నిజంగా ఎన్‌కౌంటర్ చేయాలంటే కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచి సామాన్య ప్రజలను వినోదానికి దూరం చేస్తున్న కల్యాణ్‌ను,…
బడాబాబుల గుండెల్లో ‘హైడ్రా’ గుబులు – అక్రమాలకు బ్రేక్… బాధితులకు భరోసా
సహనం వందే, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను ఆక్రమణలు, భూకబ్జాలు ఏ స్థాయిలో పట్టి పీడిస్తున్నాయో చెప్పడానికి ‘హైడ్రా‘ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులే నిదర్శనం. సోమవారం ఒక్కరోజే ఏకంగా 64 ఫిర్యాదులు అందాయంటే సామాన్యుడి కష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా పరిష్కారాలను చూసి ధైర్యం చేసి ఫిర్యాదుల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. లే అవుట్ల మ్యాపులు పట్టుకు వచ్చి అక్రమణలను కళ్లకు కట్టినట్టు వివరించడం చూస్తుంటే అధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారన్న ప్రశ్న…