జలమండలిలో కోట్ల మాయాజాలం! – ప్రజాధనంతో అధికారుల చెలగాటం!
సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వ సంస్థల్లో ప్రజాధనం ఎలా ఖర్చవుతోంది? కోట్ల రూపాయల చెల్లింపులు చేసే అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నారా? హైదరాబాద్ జలమండలిలో వెలుగుచూసిన రూ.1.3 కోట్ల నిధుల బదిలీ వ్యవహారం ఈ ప్రశ్నలకు కారణమవుతోంది. జలమండలిలో ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇది సాధారణ తప్పిదమని సరిపెట్టుకునే వ్యవహారం కాదు. భారీ చెల్లింపుల్లో కనీస తనిఖీలు కూడా చేయని అధికారుల పనితీరుపై తీవ్రమైన విమర్శలు…