దళారులకు మార్క్‌ఫెడ్‌ అండదండ

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి… వీళ్లంతా జొన్న రైతుల కోసం కృషి చేస్తుంటే కిందిస్థాయిలో కొందరు అధికారులు మాత్రం దళారులకు అమ్ముడుపోతున్నారు. జొన్న రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జొన్న కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం తమ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాదు…

Read More

ఆయిల్ పా(షే)మ్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటివరకు సాధించినది కేవలం 40,247 ఎకరాలు మాత్రమే. అంటే 40 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ సంస్థతోపాటు పలు ప్రైవేట్ సంస్థలు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. ఏ ఒక్క సంస్థ కూడా…

Read More

ప్రభుత్వ డబ్బుతో ఏఐజీకి డప్పు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ వేదికపై పరువు తీసుకుంటోంది! అందాల పోటీల పేరుతో ప్రజల సొమ్మును యథేచ్ఛగా ధారపోస్తూ ప్రైవేట్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది. మెడికల్ టూరిజం ముసుగులో ఒకవైపు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వంటి ఆసుపత్రుల వ్యాపారానికి ఎర్ర తివాచీ పరుస్తోంది. మరోవైపు ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు పెంచేందుకు అందమైన అమ్మాయిలను వాడుకుంటోంది. ఇది ప్రభుత్వ సొమ్ముతో జరుగుతున్న వ్యాపారం కాదా? ప్రజల నమ్మకాన్ని మంటగలిపే దారుణమైన చర్య కాదా?…

Read More

‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్ వేదికగా ఈ నెల 7 నుండి 31 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఈ పోటీలను తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి చాటి చెప్పే సువర్ణావకాశంగా భావిస్తూ, భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!…‘ప్రపంచం కళ్లన్నీ…

Read More

హైదరాబాద్‌లో పాకిస్తాన్ పేర్లతో బిజినెస్

సహనం వందే, హైదరాబాద్: కాశ్మీర్‌లో 26 మంది అమాయక భారతీయుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరిహద్దుల్లో నెత్తురు ఏరులై పారుతుంటే… మన హైదరాబాద్ నగరంలో మాత్రం పాకిస్తాన్ నగరాల పేర్లతో వ్యాపారం యథేచ్ఛగా కొనసాగడం అత్యంత సిగ్గుచేటు. కరాచీ బేకరీ, పెషావర్ హోటల్ వంటి ప్రసిద్ధ సంస్థలు తమ పేర్లను ఇప్పటికీ మార్చకపోవడం వారి దేశభక్తి రాహిత్యాన్ని తేటతెల్లం చేస్తోంది. శత్రుదేశపు నగరాల పేర్లను బ్రాండ్‌లుగా వాడుకోవాల్సిన దుస్థితి…

Read More

సిజేరియన్ డెలివరీలపై కఠిన చర్యలు

వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ సహనం వందే, హైదరాబాద్: సరియైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సి-సెక్షన్ ఆడిట్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ కాన్పుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి అన్నారు. సాధారణ కాన్పుల వల్ల కలిగే లాభాలను, సిజేరియన్ వల్ల జరిగే నష్టాలను…

Read More

యాదాద్రి జిల్లాలో వైద్యం అస్తవ్యస్తం

సహనం వందే, హైదరాబాద్: ప్రభుత్వం నుంచి నిధులు రావడమే కష్టం. అలాంటిది వచ్చిన నిధులను కూడా వాడుకోకపోవడం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వైద్యాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఆ జిల్లాకు వచ్చిన నిధుల్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడంతో అవి తిరిగి వెనక్కి పోయాయి. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్ సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్ సీ), జిల్లా ఆసుపత్రుల్లో సమస్యలు తిష్ట వేశాయి. దీంతో రోగులకు సరైన వైద్యం చేయడానికి…

Read More

కరెన్సీ వెనుక క్యాస్టిజం

(విజయ్ పుట్టపాగ, టీపీటీఎల్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ లాంటి మహనీయుడి చిత్రం మన కరెన్సీ నోట్లపై లేకపోవడం కేవలం పొరపాటు కాదు, ఆధిపత్య వర్గాల కుట్ర. భారత రాజ్యాంగ శిల్పి, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటులో కీలక సూత్రధారి, కుల నిర్మూలన యోధుడైన అంబేద్కర్‌ను గౌరవించకపోవడం సమాజంలో ఇప్పటికీ కొనసాగుతున్న వివక్షను సూచిస్తుంది. మహాత్మా గాంధీ జాతిపిత కాగా… అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన యోధుడు. దేశంలో అధిక సంఖ్యాకులైన బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆరాధ్య…

Read More

వక్ఫ్ భూముల కుంభకోణం!

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డుకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త వక్ఫ్ చట్టాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోని వక్ఫ్ ఆస్తుల దుస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. అసలు ఎన్ని ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి? ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? అనే అంశాలపై తాజాగా ఒక నివేదిక వెలువడింది. తెలంగాణలో 74% వక్ఫ్ భూములు కబ్జా!తెలంగాణలో వక్ఫ్ బోర్డు…

Read More

యాదాద్రిలో వైద్య డిప్యూటేషన్ల దందా

ఏకంగా 106 మంది సిబ్బందికి డిప్యూటేషన్లు సహనం వందే, హైదరాబాద్:వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లపై మంత్రి దామోదర రాజనర్సింహ నిషేధం విధించినా, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం వైద్య మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. మంత్రి ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. తమకు ఎవరూ ఎదురులేదన్న ధోరణితో ఉన్నారు. మంత్రి ఆదేశాలకు విరుద్ధంగా, ఈ కాలంలో ఏకంగా 106 మందిని డిప్యూటేషన్ ద్వారా ఇష్టమైన చోటకు పంపించారు. నర్సింగ్ ఆఫీసర్లు మొదలు సీనియర్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర సిబ్బందికి డిప్యూటేషన్లు…

Read More