Markfed

మక్కల వేలంలో చిక్కుముడులు – బేస్ ప్రైస్ లేకుండా మార్క్ ఫెడ్ వేలం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో మక్కల విక్రయం ఇప్పుడు పెద్ద చిక్కుముడిలా మారింది. ప్రభుత్వం ఏకంగా 14.70 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్‌ను బేస్ ప్రైస్ లేకుండానే ఈ-వేలం వేయడానికి సిద్ధమైంది. వానాకాలం అమ్మకాల్లో అదనపు ఆదాయం వచ్చినట్లు చెప్పుకున్నా అసలు లెక్కలు మాత్రం వందల కోట్ల నష్టాన్ని చూపిస్తున్నాయి. మార్క్ ఫెడ్ తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధానం మారిందిమార్క్‌ఫెడ్ యాసంగి మక్కల విక్రయానికి కొత్త బాట పట్టింది. ఇప్పటివరకు ఉన్న పద్ధతులకు స్వస్తి…

Read More
Chalo Karimnagar

మెడికో తల్లిదండ్రుల చలో కరీంనగర్ – ప్రతిమ, చల్మెడ మెడికల్ కాలేజీలపై ఆగ్రహం

సహనం వందే, కరీంనగర్: కరీంనగర్‌లో వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ నాలుగున్నర సంవత్సరాల ఎంబీబీఎస్ కోర్సుకు ఐదేళ్ల ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కాలేజీ యాజమాన్యాలు మొండిగా సమాధానం ఇస్తుండటంతో గందరగోళం నెలకొంది. అక్రమ ఫీజుల వసూళ్ల పర్వంకరీంనగర్‌లోని ప్రతిమ, చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలల తీరుపై తల్లిదండ్రుల కమిటీ పోరాటం చేస్తోంది. విద్యార్థుల…

Read More
Hitler & Hydraa

హైడ్రాలో హిట్లర్ నీడ – సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యల కలకలం

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా పేరు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మార్వెల్ కామిక్స్‌లోని ఒక క్రూరమైన ఉగ్రవాద సంస్థ పేరును నేటి రాజకీయాలకు ముడిపెట్టడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. హిట్లర్ భావజాలం నుండి ప్రేరణ పొందినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ పాలనా విధానంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. రాజకీయ వేదికపై సినిమా కల్పనమార్వెల్ కామిక్స్‌లో హైడ్రా అనేది ఒక కల్పిత ఉగ్రవాద సంస్థ. ప్రపంచాన్ని భయంతో నియంత్రించడం,…

Read More
Kaloji Narayana Rao Health University

మెడికల్ ఫీ’జులుం’పై ఉక్కుపాదం – రంగంలోకి దిగిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

సహనం వందే, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తూ చేస్తున్న దోపిడీపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. నాలుగున్నరేళ్ల కోర్సు కాలానికి మించి ఫీజులు అడగవద్దని స్పష్టం చేస్తూనే ఇంటర్న్‌షిప్ అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలను హెచ్చరించింది. ప్రభుత్వం, ఎన్ఎంసీ, టీఏఎఫ్ఆర్సీ నిబంధనల అమలే పరమావధిగా శనివారం ఈ కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి కొన్ని ప్రైవేట్…

Read More
Pawan Kalyan Politics

పవన్ మెరుపు… ఎందుకీ ఉలుకు – ఫాంహౌస్ వివాదాన్ని పక్కదారి పట్టించే చర్య!

సహనం వందే, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తెలంగాణ రాజకీయ తెరపైకి దూసుకొచ్చారు. ఫామ్ హౌస్ వివాదం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ కేసుల వరకు అనేక ఆరోపణలు చుట్టుముడుతున్న వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. ఆంధ్ర రాజకీయ పరిమితులను అధిగమించి, సరిహద్దులు దాటి ఆయన చేస్తోన్న ఈ రాజకీయ విన్యాసాలు వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి? రగిలిన వివాదాల మంటలుపవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు వివాదాల వలయం…

Read More
Telangana Retired Employees Health Cards

రిటైర్డ్ ఉద్యోగుల గోడు – సర్కారు హెల్త్ కార్డుల సందిగ్ధం

సహనం వందే, హైదరాబాద్: జీవితకాలం కష్టపడి సమాజానికి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు ఇప్పుడు ఆసుపత్రుల గడపల ముందు నిస్సహాయంగా నిలబడుతున్నారు. ప్రభుత్వ హెల్త్ కార్డులు చేతికి వస్తున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవి చెల్లుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల హామీలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య నలిగిపోతున్న వృద్ధుల ఆవేదన, సర్కారు తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్లాస్టిక్ కార్డుల మాయాజాలంతెలంగాణ ప్రభుత్వం జూన్ 2న కొత్త హెల్త్ కార్డులను పంపిణీ చేయడానికి వేగంగా ఏర్పాట్లు…

Read More
Harishrao Against Future City

జర్నలిస్టుల ఇళ్లకు హరీష్ ఎసరు – ఫ్యూచర్ సిటీ రద్దు ప్రకటన

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు వదిలిన పొలిటికల్ అస్త్రం తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రేపింది. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రద్దు చేస్తామన్న ప్రకటన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ రాజకీయ చదరంగంలో ఇళ్ల స్థలాలు ఆశించిన జర్నలిస్టులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. అమెరికా వేదికగా పొలిటికల్ బాంబ్తెలంగాణ రాజకీయం ఎల్లలు దాటి అమెరికా వేదికగా సంచలనం సృష్టించింది….

Read More
Jonna Rotis

హైదరాబాదులో జొన్న రొట్టె జైత్రయాత్ర – పేదవాడి కూడు ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్

సహనం వందే, హైదరాబాద్: బిర్యానీల నగరంలో ఇప్పుడు జొన్న రొట్టెల జాతర నడుస్తోంది. రాత్రి వేళల్లో పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ తిని విసిగిపోయిన భాగ్యనగర వాసులు ఇప్పుడు ఆరోగ్యకరమైన సిరిధాన్యాల వైపు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు పేదవాడి ఆహారంగా భావించిన ఈ గ్రామీణ వంటకం… ఇప్పుడు హైటెక్ సిటీ కార్పొరేట్ ఉద్యోగుల ప్లేట్లలో హాట్ కేకుల్లా మారి సరికొత్త ఆహార విప్లవాన్ని సృష్టిస్తోంది. నగరంలో మారిన ట్రెండ్హైదరాబాద్ అంటేనే బిర్యానీకి కేరాఫ్ అడ్రస్. కానీ ఐటీ కల్చర్…

Read More
LuLu Mall

లులు గోల్‌’మాల్’ – కుళ్లిన కూరగాయల దందా

సహనం వందే, హైదరాబాద్: పెద్ద పెద్ద మాల్స్ అంటే సామాన్యుడికి ఒక నమ్మకం. నాలుగు పైసలు ఎక్కువైనా నాణ్యత దొరుకుతుందనే ఆశ. కానీ ఆ నమ్మకాన్ని నడిరోడ్డుపై నిలబెట్టింది లులు హైపర్‌ మార్కెట్. మెరిసే కాంతులు, ఏసీల వెనుక దాగున్న అసలు నిజాలు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బట్టబయలయ్యాయి. బ్రాండ్ల ముసుగులో జరుగుతున్న ఈ దందా నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. తనిఖీల్లో షాకింగ్ నిజాలుహైదరాబాద్ కూకట్‌పల్లిలోని ప్రముఖ లులు హైపర్‌మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు…

Read More
South Youth Politics

సౌత్ లో యూత్ సెన్సేషన్ – దక్షిణాది పాలిటిక్స్: కుర్రాళ్ల కేక

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాలంటే ఒకప్పుడు రిటైర్మెంట్ తర్వాత చేసే కాలక్షేపం. తెల్ల జుట్టు, ముడతలు పడిన ముఖాలే పవర్ సెంటర్లుగా ఉండేవి. కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. 50 ఏళ్ల లోపు రాజకీయ కుర్రాళ్లే ఇప్పుడు రాజ్యాధికారాన్ని శాసిస్తున్నారు. వెండితెర రికార్డులను తిరగరాసిన హీరోల నుంచి విదేశాల్లో చదువుకున్న వారసుల దాకా అంతా పవర్ పాలిటిక్స్‌లోకి దూసుకొచ్చారు. తమిళనాడులో దళపతి ప్రభంజనంతమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. వెండితెర…

Read More