‘అల్లాహ్’ సందేశంతో సైబర్ దాడి

సహనం వందే, ఢిల్లీ: ‘అల్లాహ్ మాతో ఉన్నాడు… మీ మతం మిమ్మల్ని కాపాడలేదు!’ భారత సైనిక నర్సింగ్ కళాశాల వెబ్‌సైట్‌లో శుక్రవారం హ్యాకర్లు పోస్ట్ చేసిన ఈ బెదిరింపు సందేశం దేశాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకి గురిచేసింది. పహల్గాంలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషాదం ఇంకా మన మదిని కలచివేస్తుండగానే ఈ సైబర్ దాడి జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదులు కేవలం భౌతికంగానే కాకుండా, డిజిటల్‌గా కూడా మనపై దాడి చేయడానికి సిద్ధంగా…

Read More

ఉగ్రదాడికి అంతర్గత సాయంపై అనుమానాలు

సహనం వందే, కోల్ కతా: కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి దేశీయంగా ఎవరైనా సాయం చేశారా అన్న అనుమానాలు ఉన్నాయని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్‌చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కోల్ కతాలో పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇంత పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు ఎలా చొచ్చుకురాగలిగారనే దానిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎక్కడో పెద్ద లోపం జరిగింది. ఇంత మంది చొరబాటుదారులు ఎలా లోపలికి…

Read More

ఇండియా చుట్టూ శత్రువలయం

సహనం వందే, ఢిల్లీ: మన దేశం చుట్టూ శత్రుదేశాల కోరలు చాస్తున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ తన ఉగ్రవాద చర్యలతో నిత్యం మనల్ని రెచ్చగొడుతోంది. ఉత్తరాన చైనా తన దుష్ట పన్నాగాలతో సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతోంది. తూర్పున బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లు ఆగడం లేదు. దక్షిణాన శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే… ఆఫ్ఘనిస్తాన్‌లోని అల్లకల్లోల పరిస్థితులు మనకు నిత్యం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ శత్రుదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మనపై కుట్రలు పన్నుతుండటం…

Read More

యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఖతం!

సహనం వందే, హైదరాబాద్: 1993లో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ రూపొందించిన అత్యంత రహస్యమైన డాక్యుమెంట్స్ ఇప్పు డు కలకలం రేపుతున్నాయి. భారత్-పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం సంభవిస్తే పాకిస్తాన్ కేవలం సైనిక పరంగానే కాదు… దేశంగా కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆ డాక్యుమెంట్స్ 30 ఏళ్ల క్రితమే హెచ్చరించాయి. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సీక్రెట్ రిపోర్ట్స్ బయటకు రావటం సంచలనంగా మారింది. మరి…

Read More

జైలు నుంచే జాక్వెలిన్‌కు బాలీ ద్వీపం గిఫ్ట్!

సహనం వందే, హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో ఊచలు లెక్కబెడుతున్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లోకెక్కాడు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి చనిపోయినందుకు సంతాపం తెలుపుతూ… ఏకంగా ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో కొంత భాగాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చేశాడట! ఈ ప్రేమ పిచ్చోడు ఢిల్లీలోని జైలు నుంచి రాసిన లేఖలో ఈ విషయం వెల్లడించాడు. బాలీలో నీకో అందమైన లోకం! తన లేఖలో సుకేశ్… జాక్వెలిన్ తల్లి మరణం తనను తీవ్రంగా బాధించిందని,…

Read More

పాక్ రాయబార కార్యాలయంలో కేక్ కటింగ్

సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు నింపుతుంటే… ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు ఓ వ్యక్తి కేక్ పట్టుకెళ్లిన అత్యంత హేయమైన ఘటన సంచలనం రేపింది. 26 మంది పర్యాటకుల ప్రాణాలు పోగొట్టుకున్న విషాద సమయంలో ఇలాంటి చర్యకు పాల్పడటం దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. నెత్తుటి మరకలు ఆరకముందే సంబరాలా? ఏప్రిల్ 22న బైసరన్…

Read More

భారత్ కూ కావాలి…ఘోస్ట్ ఆర్మీ ‘మొసాద్’

సహనం వందే, హైదరాబాద్: ఇజ్రాయెల్… మధ్యప్రాచ్యంలో నిత్యం అగ్నిగుండంలా ఉండే ఒక చిన్న దేశం. చుట్టూ శత్రుదేశాలు… నిత్యం ఉగ్రవాద దాడుల ముప్పు. కానీ ఇజ్రాయెల్ ధైర్యంగా నిలబడుతోంది. దానికి ఒక ముఖ్య కారణం దాని శక్తివంతమైన గూఢచర్య సంస్థ మొసాద్. మొసాద్ అంటే హెబ్రీ భాషలో “నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ”. ఇది ఇజ్రాయెల్ కు కళ్లు, చెవులు మాత్రమే కాదు… దాని రహస్య ఆయుధం కూడా. మొసాద్ తన దేశ భద్రత కోసం ఎంతటి సాహసానికైనా…

Read More

మతం ముసుగులో మారణహోమం

సహనం వందే, జమ్ము కాశ్మీర్: కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు… వారి మతం తెలుసుకొని మరీ హిందువులను లక్ష్యంగా చేసుకున్నారన్న వార్తలు మరింత కలచి వేస్తున్నాయి. ఈ దుర్ఘటన కేవలం ఒక ఉగ్రవాద చర్య మాత్రమే కాదు… మతోన్మాదం విషం ఎంతగా పాతుకుపోయిందో చెప్పే భయానక సత్యం. ఈ దుర్ఘటన యావత్ భారతదేశ లౌకికవాద స్ఫూర్తిని ప్రశ్నిస్తోంది. మతాల మధ్య గొడవలు చెలరేగేలా……

Read More

అదానీ గ్రూప్ ‘ఆపరేషన్ జెప్పెలిన్’

సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌పై 2023లో హిండెన్‌బర్గ్ అనే సంస్థ చేసిన ఆరోపణలకు ‘ఆపరేషన్ జెప్పెలిన్’ ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో అదాని గ్రూపు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేలినట్లు వార్తా సంస్థలు చెప్తున్నాయి. కాగా, అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడిందని, ఆర్థిక మోసాలు చేసిందని 2024లో హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల వల్ల అదానీ గ్రూప్ మార్కెట్ విలువ బాగా పడిపోయింది. అయితే, అదానీ…

Read More

మహారాష్ట్రలో హిందీకి బ్రేక్

సహనం వందే, ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో భాషా రాజకీయాలు మరోసారి వేడెక్కడంతో, ప్రాంతీయ వాణి గట్టిగా వినిపించడంతో ఈ ఉత్తర్వును నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత…

Read More