30 ఏళ్ల సర్వీసు… 57 బదిలీలు

సహనం వందే, హరియాణా: హర్యానా కేడర్‌లో తిరుగులేని ధైర్యానికి మారుపేరుగా నిలిచిన ఐఏఎస్ అధికారి అశోక్ బుధవారం పదవి విరమణ చేశారు. తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఏకంగా 57 సార్లు బదిలీ అయిన ఆయన… అవినీతిపై నిక్కచ్చిగా పోరాడిన యోధుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.1991 బ్యాచ్‌కు చెందిన అశోక్ ఖేమ్కా హరియాణా ఎన్నో కీలక పదవులు నిర్వహించినా, ఎక్కడ అవినీతి కనిపించినా నిలదీసే తత్వం ఆయనది. ఈ కారణంగానే అధికారులు, రాజకీయ నాయకుల నుంచి…

Read More

ఏఐలో భారత్ వెనుకబాటు

సహనం వందే, హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంలో భారతదేశం వెనుకబాటులో ఉందని గూగుల్, కాంటార్ నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. ఏఐ వినియోగం ఆశించిన స్థాయిలో లేదని తెలిపింది. 18 నగరాల్లో 8,000 మందితో జరిపిన సర్వే ఏఐ గురించి 60% మందికి తెలియదని, కేవలం 31% మంది మాత్రమే ఏఐ టూల్స్ ను ప్రయత్నించారని పేర్కొంది. ఈ గణాంకాలు భారతదేశం ఏఐ విప్లవంలో వెనుకబడుతుందనే ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఏఐ వినియోగంలో అడ్డంకులు ఎక్కడ?భారతీయులలో ఏఐ…

Read More

బీహార్ బుల్డోజర్

సహనం వందే, పాట్నా: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే మెరుపు శతకం బాది, క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ బీహార్ బుల్డోజర్… గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై 11 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుడిగా నిలిచిన వైభవ్ వెనుక ఎన్నో త్యాగాలు, కఠోర…

Read More

పహల్గాంలో హైటెక్ టెర్రరిజం

సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి కేవలం ఒక హింసాత్మక చర్య మాత్రమే కాదు, భారత భద్రతా వ్యవస్థపై జరిగిన సైబర్ దాడి! పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు చైనా తయారీ శాటిలైట్ ఫోన్లు, నిషేధిత ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించి తమ మారణకాండను సమన్వయం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ హైటెక్ టెర్రరిజం వెనుక అంతర్జాతీయ శక్తులున్నాయని స్పష్టమవుతోంది. భారత భూభాగంలోకి చొరబడిన ఈ సైబర్ ఉగ్రవాదులు…

Read More

పిల్లలతో అసభ్యంగా ఏఐ చాట్‌బాట్‌

సహనం వందే హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా రూపొందించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్‌బాట్‌లు ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాయి. ఈ చాట్‌బాట్‌లు సరదా సంభాషణల కోసం తయారు చేసినా, ఇవి చిన్నారులతో సహా అందరు యూజర్లతో అసభ్యకరమైన, లైంగిక విషయాలు మాట్లాడుతున్నాయని కొత్తగా వెలుగులోకి వచ్చింది. మెటా ఏఐ అధికారిక చాట్‌బాట్‌తో పాటు యూజర్లు తయారుచేసిన చాలా చాట్‌బాట్‌లు లైంగిక చర్చలను ప్రోత్సహిస్తున్నాయి. ఇది పిల్లల భద్రతకు పెను ప్రమాదంగా మారుతోందని ఆందోళనలు…

Read More

తొలి మహిళా డాగ్ హ్యాండ్లర్ శ్రీలక్ష్మి

సహనం వందే, అస్సాం: భారత సైన్యంలోని ప్రతిష్టాత్మక అస్సాం రైఫిల్స్‌లో ఒక తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. రైఫిల్‌వుమన్ పీవీ శ్రీలక్ష్మి… ఈ పారామిలిటరీ దళం మొట్టమొదటి మహిళా డాగ్ హ్యాండ్లర్‌గా విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న ఈ కీలక విభాగంలో శ్రీలక్ష్మి తన అంకితభావం, ధైర్యంతో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. అస్సాం రైఫిల్స్ స్వయంగా ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించడంతో, సోషల్ మీడియాలో ఆమె…

Read More

పాఠ్యపుస్తకాల్లో ‘మొఘలు’లకు మంగళం

సహనం వందే, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ ఏడో తరగతి పాఠ్యపుస్తకాలను పూర్తిగా మార్చడం సంచలనంగా మారింది. ఈ పుస్తకాల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. నూతన పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తానేట్‌కు సంబంధించిన సమస్త చరిత్రను తొలగించింది. ‘భూమి ఎలా పవిత్రమవుతుంద’నే కొత్త చాప్టర్ ను పొందుపరిచారు. ఈ చాప్టర్లో హిందూ, బౌద్ధ, సిక్కు, ఇస్లాం, క్రైస్తవ, జుడాయిజం, జోరాస్ట్రియన్ మతాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే భారత్ సహా ఇతర దేశాల్లోని…

Read More

తెలుగు తెరపై ‘ఉత్తరాధి’పత్యం

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ… ఒకప్పుడు తెలుగు భాష, సంస్కృతి, జీవన విధానాన్ని తెరపై చాటి గర్వంగా తలెత్తుకుంది. ఏటా 100-150 చిత్రాలతో బాక్సాఫీస్‌లో బాలీవుడ్‌తో సమానంగా పోటీపడిన ఈ పరిశ్రమ, ఇప్పుడు ఉత్తరాది నటుల ఆధిపత్యం ముందు గిలగిలలాడుతుంది. తమన్నా, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, బాబీ డియోల్, సునీల్ షెట్టి, శ్రద్ధా కపూర్, అనన్య పాండే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ఉత్తరాది సినీ తారలు టాలీవుడ్‌ను సాంస్కృతికంగా…

Read More

మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్ 2025’లో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 దేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్న ఈ సమ్మిట్ చివరి రోజున రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. విపక్షాలను అణగదొక్కడమే అధికార…

Read More

కాశ్మీర్ వెయ్యేళ్ళ పోరాటమా?

సహనం వందే వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాశ్మీర్ సమస్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. భారత్, పాకిస్థాన్‌లు కాశ్మీర్ కోసం “వెయ్యి సంవత్సరాలుగా” పోరాడుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చరిత్రాత్మకంగా తప్పుగా ఉన్నాయని, పాకిస్థాన్ 1947లోనే ఏర్పడిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. భారత్-పాక్…

Read More