కమల్ హాసన్ కు తమిళనాట మైలేజీ!

సహనం వందే, చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘థగ్ లైఫ్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా కన్నడ భాష పుట్టుక గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో పెను దుమారాన్ని రేపాయి. అయితే ఈ వివాదం తమిళనాడులో ఆయనకు రాజకీయంగా కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్నడ భాషపై తీవ్ర వివాదం…‘థగ్ లైఫ్’ ప్రమోషన్ ఈవెంట్‌లో…

Read More

‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా?’

సహనం వందే, బెంగళూరు: ‘జనాల్ని చంపేందుకే కప్ సాధించారా? అభిమానుల ప్రాణాల కంటే మీ సెలబ్రేషన్సే ముఖ్యమా’ అంటూ బెంగళూరు తొక్కిస్తాలాటపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లూ ఆర్సీబీ మాదిరిగా విపరీతమైన సెలబ్రేషన్స్ నిర్వహించలేదని, వీరి అతి కారణంగానే ఈ విషాదం చోటుచేసుకుందని మండిపడుతున్నారు. అభిమానుల ఆవేశం…ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను పంజాబ్ కింగ్స్‌పై 6 రన్స్…

Read More

కమల్ హాసన్ మాటల తూటాలు

సహనం వందే, చెన్నై: చెన్నైలో ఇటీవల జరిగిన థగ్ లైఫ్ అనే కార్యక్రమం ఒక భారీ వివాదానికి కేంద్రమైంది. ఈ వేడుకలో పాల్గొన్న కమల్ హాసన్, కన్నడ భాష కూడా తమిళం నుంచే ఉద్భవించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమైంది. తమిళులు, కన్నడిగుల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండవన్న విషయం తెలిసిందే. జల వివాదాలు, సరిహద్దు తగాదాలు వంటి అంశాలు ఎప్పుడూ రగులుకుంటూనే ఉంటాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా…

Read More

ఎంబీబీఎస్-ఆయుర్వేద ఇంటిగ్రేటెడ్ కోర్సు

సహనం వందే, హైదరాబాద్: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఎంబీబీఎస్, బీఏఎంఎస్ లను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సును ప్రవేశపెట్టనుంది. ఆధునిక వైద్య విజ్ఞానం, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య పద్ధతులను సమన్వయం చేయడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ప్రాథమిక దశలో కోర్సు…ప్రస్తుతం ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రాథమిక దశలో ఉంది. ఈ కోర్సు కోసం సరికొత్త…

Read More

అందాల పోటీలా? వేశ్యా కేంద్రాలా?

సహనం వందే, హైదరాబాద్: హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీలు వివాదాస్పదంగా మారాయి. ఈ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లాండ్-2024 విజేత మిల్లా మాగీ (24) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది. అంతేకాదు ఈ పోటీలను బహిష్కరించి ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ‘నేను ఈ ఈవెంట్‌లో వేశ్యలా భావించా. ఎల్లప్పుడూ మేకప్‌లో ఉండాలట. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్లలో ఉండాలట. అందాల పోటీలను స్పాన్సర్ చేస్తున్న మధ్య వయస్కులైన పురుషులతో సోషలైజ్…

Read More

దానం ముసుగులో దగా

సహనం వందే, హైదరాబాద్: ‘ఒక బిలియనీర్ దానం చేస్తున్నాడంటే, కమ్యూనిజం మీ బుర్రకెక్కలేదని అర్థం’- కారల్ మార్క్స్ అన్న ఈ మాటలు నేటి బిలియనీర్ల దానాల వెనుక దాగి ఉన్న నిజాలను బట్టబయలు చేస్తున్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు తమ సంపదలో కొంత భాగాన్ని దానం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మార్క్స్ దృష్టితో చూస్తే ఈ దానాల వెనుక స్వచ్ఛమైన ఉద్దేశాలు కాకుండా, తమ సామ్రాజ్యాలను కాపాడుకునే కుట్రలు, పన్నులు ఎగ్గొట్టే దిక్కుమాలిన ఎత్తుగడలు…

Read More

ఆకలి తీర్చని ఏఐ

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక విప్లవం ఈ శతాబ్దాన్ని అబ్బురపరుస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) జీవితాలను మార్చేస్తోంది. అంతరిక్ష యాత్రలు సామాన్యమవుతున్నాయి. గంటల ప్రయాణాలు నిమిషాల్లో సాధ్యమవుతున్నాయి. వైద్యం, రవాణా, సమాచార రంగాల్లో సైన్స్ అనూహ్యమైన పురోగతిని సాధిస్తోంది. కానీ ఈ అద్భుతమైన సాంకేతికత ఉన్నా, భారతదేశంలో కోట్లాది మంది ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ ఆకలి కేకల్లో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి బహుజనులే ఉన్నారు. ఏఐ వంటి సాంకేతికత ఈ బహుజనుల…

Read More

‘సుప్రీం’పై కుల వివక్ష

సహనం వందే, హైదరాబాద్: భారత రాజ్యాంగం సమానత్వాన్ని ప్రకటించినా… దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తులు దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నప్పటికీ కుల వివక్ష కోరలు చాస్తూనే ఉంది. ఈ చేదు నిజాన్ని చాటిచెప్పేలా ఇటీవలి కొన్ని సంఘటనలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి. ఇది కేవలం సామాన్యుల సమస్య కాదని, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికీ కులం పేరుతో అవమానాలు తప్పడం లేదని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. భారత సమాజంలో కుల వివక్ష ఎంత…

Read More

‘ఇది కర్ణాటక… ఇది ఇండియా’

సహనం వందే, కర్ణాటక: కర్ణాటకలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారిణి ప్రవర్తన రాష్ట్రంలో తీవ్ర భాషా వివాదానికి దారితీసింది. అనేకల్ తాలూకాలోని సూర్యనగర బ్రాంచ్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ కస్టమర్‌తో అధికారిణి కన్నడ మాట్లాడటానికి నిరాకరించింది‌. పైగా హిందీ మాట్లాడాలని పట్టుబట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు ఆ ఉద్యోగిణిని బదిలీ చేశారు. కస్టమర్‌తో అధికారిణి తీవ్ర వాగ్వాదంసూర్య…

Read More

కరోనా? కుట్రనా?

సహనం వందే, హైదరాబాద్: సింగపూర్, భారతదేశంలో కోవిడ్ జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని పరీక్షించినప్పుడు ఈ వైరస్ బయటపడుతోందని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎండమిక్ దశలో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు అంతర్జాతీయంగా దాని వ్యాప్తిని మళ్ళీ ముందుకు తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం పన్నుతున్న కుట్రగా కొందరు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా నిజంగానే…

Read More