హిందీకి ‘మహా’దెబ్బ – త్రిభాషా విధానంపై వెనక్కు తగ్గిన మహారాష్ట్ర

సహనం వందే, ముంబై:బాలీవుడ్ కు కేంద్ర బిందువైన మహారాష్ట్రలో హిందీ భాషకు ఎదురుగాలి వీస్తోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో హిందీ తప్పనిసరి విధానాన్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా విధానంపై ఇంతకాలం కొనసాగిన వివాదాలకు తెరదించుతూ వివాదాస్పదమైన ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానాన్ని…

Read More

బిజీ భ్రమల్లో ఐఏఎస్‌ – 80% అనవసర పనులపైనే కేంద్రీకరణ

సహనం వందే, హైదరాబాద్: ఆయన తెలంగాణలో కీలకమైన హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్‌ అధికారి. ఆయన చేతిలో అత్యంత కీలక శాఖ ఉంది. కానీ ఆ సీనియర్ అధికారి మాత్రం రొటీన్ మీటింగ్స్, రిపోర్ట్స్ తదితర పనుల వైపే మొగ్గు చూపుతుంటారు. కిందిస్థాయి ఉద్యోగులను భయపెట్టడం ద్వారానే పని చేయించాలన్న దృక్పథంతో ఉంటారు. దానికే ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీంతో ఎంతో బిజీగా కనిపిస్తారు. కానీ కీలకమైన పనులన్నీ పక్కకు పోతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఒక…

Read More

‘ఆకలిగా ఉన్నప్పుడే తిను’ – మాధవన్ యవ్వన ఫిట్‌నెస్ చిట్కా

సహనం వందే, ముంబై:బాలీవుడ్ నటుడు మాధవన్ 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యవ్వనంతో మెరిసిపోతున్నాడు. ఇటీవలే విడుదలైన తన కొత్త సినిమా ఆప్ జైసా కోయ్ ట్రైలర్‌లో అతని రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసును తగ్గించే సాంకేతికత (డీ-ఏజింగ్ టెక్నాలజీ) ఉపయోగించారనే పుకార్లను ఖండిస్తూ..‌‌. తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించాడు. ఆరోగ్యకరమైన జీవనశైలి, అత్యంత సాధారణమైన ఆహార నియమాలతో ఎలా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండవచ్చో వివరించాడు. ‘నా రూపం కోసం వయసును తగ్గించే సాంకేతికత ఉపయోగించానని…

Read More

సైకిల్ పై 94 ఏళ్ల తాత పరుగులు – ఈ వయసులోనూ పత్రికల పంపిణీ

సహనం వందే, చెన్నై:వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని, నిజమైన ఉత్సాహం గుండెల్లోనే ఉంటుందని చెన్నైలోని గోపాలపురం వాసి షణ్ముగసుందరం నిరూపిస్తున్నారు. ఈ 94 ఏళ్ల తాత తన సైకిల్‌పై వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తూ ప్రతి రోజూ అలుపెరగని కృషికి, సమాజంతో మమేకమైన జీవన విధానానికి ఓ గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు. అందరూ ముద్దుగా ‘పేపర్ తాత’ అని పిలుచుకునే ఈయన జీవితగాథ, యువతరానికి సైతం స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప పాఠం. ఉదయం…

Read More

దక్షిణాది రాష్ట్రాలపై నరేంద్ర మోడీ దండయాత్ర

సహనం వందే, హైదరాబాద్:దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో సమగ్ర వ్యూహాలు రచిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దక్షిణ రాష్ట్రాల్లో తమ పట్టు బలోపేతం చేసుకోవడానికి బీజేపీ రాజకీయ కసరత్తులు చేస్తోంది. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ, డీఎంకే, కాంగ్రెస్, సీపీఎంలను బలహీనపరిచేందుకు బీజేపీ స్థానిక నాయకత్వం, పొత్తులు, సినీ తారలను ఉపయోగించుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు…

Read More

కోడిగుడ్ల కుంభకోణం? – అంగన్‌వాడీ పిల్లల ఆకలితో ఆటలు

సహనం వందే, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. నెలల తరబడి సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అంగన్‌వాడీ పిల్లల పోషకాహారాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా నాలుగోసారి దరఖాస్తు గడువు పొడిగింపుతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువును పొడిగించింది. కానీ టెండర్లు ఎప్పుడు తెరుస్తారో మాత్రం చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతోంది. అంతులేని…

Read More

ఓం బదులు ఇస్లామిక్ పదం బిస్మిల్లాతో రామాయణం

సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే రామాయణం శతాబ్దాల తరబడి ఎన్నో రూపాల్లో ప్రజల హృదయాల్లో కొలువై ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరంలోని చారిత్రక రజా గ్రంథాలయంలో ఉన్న ఒక అద్భుతమైన పర్షియన్ రామాయణ కావ్యం, ఈ పుణ్య గ్రంథానికి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఓంకారంతో కాకుండా, ఇస్లామిక్ పవిత్ర పదమైన బిస్మిల్లా అర్-రహమాన్ అర్-రహీమ్ (అల్లాహ్ పేరుతో, అత్యంత దయగలవాడు, అత్యంత కరుణామయుడు)తో ఈ రామాయణం ప్రారంభం…

Read More

జ్యోతిష్యం చెబుతున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా?

సహనం వందే, హైదరాబాద్:అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని శోకసంద్రంలో ముంచుతుంటే… జ్యోతిష్యురాలు శర్మిష్ఠ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ సంఘటన జరుగుతుందని తాను ముందే జోస్యం చెప్పానని ఆమె అంటున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పారా? లేదా ఈ సంఘటన జరగాలని చేతబడి చేశారా? లేదా చావులకు ముహూర్తం పెట్టారా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె జ్యోతిష్యం చెప్పినట్లుగా లేదు… తాను అంచనా వేసినట్లే ఈ ఘటన జరగడంపై ఆనందం వ్యక్తం…

Read More

బోయింగ్ ఢమాల్ -అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎఫెక్ట్

సహనం వందే, అమెరికా:అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటన… అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని అత్యంత విజయవంతమైన విమానాల్లో ఒకటైన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ భద్రతా రికార్డును తీవ్రంగా దెబ్బతీసింది. ఇప్పటికే భద్రతా, ఉత్పత్తి సమస్యలతో సతమతమవుతున్న బోయింగ్ సంస్థకు ఈ ప్రమాదం మరో గట్టి దెబ్బగా భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్ (నాస్డాక్)లో బోయింగ్ షేర్లు 6.5% నుండి 8% వరకు పడిపోయాయి. దీని ఫలితంగా సంస్థకు…

Read More

జెన్ జెడ్ జెట్ స్పీడ్…

సహన బొల్లోజు జనరేషన్‌ జెడ్‌… ఇప్పుడిప్పుడే పదహారేళ్ల పడుచుప్రాయాన్ని పూర్తి చేసుకున్న యువత. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ… ఉన్నత చదువులతో జీవితంలో స్థిరపడేందుకు… లక్ష్య సాధన కోసం జెట్‌ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఎంతో పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ సరికొత్త ప్రపంచాన్ని చుట్టేసేందుకు పయనమైన జనరేషన్‌ జెడ్‌కు చిత్రవిచిత్ర పరిస్థితులు ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఇన్నాళ్లూ నేర్చుకున్న పరిజ్ఞానం… అనుసరించిన విధానం…. సాగుతున్న తరుణం సరైన దిశలోను ఉందా? లేక దారితప్పిందా? అనే సందేహాలు యువ మస్తిష్కాన్ని ఆందోళనకు…

Read More