సెలబ్రిటీలకు మీడి(ద)యా – మహిళా ఘోష వినపడలేదా?
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం ఎంత డిజిటల్ మాయాజాలంలో మునిగితేలుతున్నా మహిళల పట్ల వివక్ష మాత్రం పాతాళానికి చేరుతోంది. కృత్రిమ మేధస్సు సాయంతో మహిళలపై జరుగుతున్న హింస కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకవైపు అమానవీయ ఘటనలు పెరుగుతుంటే మరోవైపు మీడియా వాటిని విస్మరిస్తోంది. ప్రజాస్వామ్యం ముసుగులో జరుగుతున్న ఈ ఘోరాలపై లోతైన చర్చ అవసరం. పడిపోయిన ప్రాధాన్యతయూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెంటర్ ఫర్ జర్నలిజం అండ్ డెమోక్రసీ, గ్లోబల్ మీడియా మానిటరింగ్ ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా…