కమ్యూనిజం కొత్త వేషం – కంప్యూటర్ కోడింగ్ రూపంలో వర్గ పోరాటం
సహనం వందే, హైదరాబాద్: మనం పుట్టినప్పుడు మన చేతులకు ఉన్న రేఖలు మన భవిష్యత్తును చెప్తాయని అమ్మమ్మలు అనేవారు. కానీ ఇప్పుడు ఆ రేఖల స్థానంలో సిలికాన్ చిప్‌లు, మెటల్ తీగలు వచ్చి చేరాయి. శ్రమను నమ్ముకున్న మధ్యతరగతి మనిషి ఇప్పుడు ఒక అపరిచిత యుద్ధంలో నిలబడ్డాడు. తనకి తెలియని శత్రువుతో, తాను చూడని రోబోలతో అతను పోరాడుతున్నాడు. ఇది కేవలం రాజకీయాల గురించి కాదు, ఇది మనిషి ఉనికి గురించి. గొంతు చించుకుని చేసే నినాదాలు…