‘కృష్ణయ్య’ లీలలు… కాషాయ ‘రంగులు’ – అడ్డమేసిన పార్టీ ఎంపీనే బీసీలకు అండనా?
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు బీసీ సంఘాలు ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ రాజకీయ విచిత్రాలకు నిలయంగా మారింది. రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని అందరికీ తెలిసినా… అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఆర్. ‘కృష్ణయ్య’ ఈ బంద్‌కు ప్రధానంగా నాయకత్వం వహించడం హాస్యాస్పదం. ఆయనతోపాటు మరో బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతులు కలపడం… బీసీ బంధువుల్లోని శత్రువుల నాటకానికి అద్దం…