భక్తితో ఐటీ ఉద్యోగి కోట్లు – ఆస్ట్రోటాక్ వ్యాపారంలో అదిరిపోయే సక్సెస్
సహనం వందే, హైదరాబాద్: సాధారణ మధ్యతరగతి యువకుడు ఐటీ ఉద్యోగం వదిలేసి జ్యోతిష్య రంగంలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది? పునీత్ గుప్తా ప్రస్థానం సరిగ్గా అలాగే మొదలైంది. ఒక చిన్న ఆలోచన నేడు ఆధ్యాత్మిక వాణిజ్య సామ్రాజ్యంగా మారింది. ఆస్ట్రోటాక్ స్టోర్ ద్వారా కేవలం ఏడాదిలోనే వందల కోట్ల ఆదాయం సాధించి కార్పొరేట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచారు. నమ్మకానికి టెక్నాలజీ తోడైతే సక్సెస్ ఎలా ఉంటుందో ఈ కుర్రాడు నిరూపించాడు. పునీత్ ప్రస్థానంఆస్ట్రోటాక్ వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా…