Swiggy Instamart

సిగ్గులేని స్విగ్గీ – ఇన్స్టామార్ట్ అరాచకం బట్టబయలు

సహనం వందే, న్యూఢిల్లీ: నిమిషాల్లో డెలివరీ పేరిట సామాన్యుల కడుపులోకి విషాన్ని పంపిస్తోంది స్విగ్గీ ఇన్స్టామార్ట్. పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, బ్రెడ్, బిస్కెట్లు, చిరుతిళ్లు వంటి నిత్యావసర ఆహార పదార్థాలను పంపిణీ చేసే ఈ సంస్థ, ఇప్పుడు కలుషిత ఉత్పత్తులతో వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ)… ఏకంగా 9 నోటీసులను జారీ చేసి సంస్థకు చుక్కలు చూపిస్తోంది. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో…

Read More
Pet Animals

పాడెక్కిస్తున్న పెంపుడు జంతువులు – గాలిలో ఏటా 12 లక్షల మంది ప్రాణాలు

సహనం వందే, హైదరాబాద్: మనం ప్రేమగా పెంచుకునే కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ప్రేమగా దగ్గరకు తీసుకునే ఈ జీవుల నుంచి ప్రాణాంతక వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మన చుట్టూ ఉన్న జంతువులే రోగాలను మోసుకొచ్చే వాహకాలుగా మారుతున్నాయి. ప్రకృతిని కాపాడుకోకపోతే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ ఆరోగ్య సంక్షోభం వెనుక ఉన్న భయంకర నిజాలివే. నిశ్శబ్దంగా విస్తరిస్తున్న మహమ్మారిమనుషులకు సోకే ఇన్ఫెక్షన్లలో 60 శాతం జంతువుల నుంచే వస్తున్నాయి. మనం రోజూ చూసే…

Read More
Trump Mobile

ట్రంప్ పేరుతో కంపు ఫోన్ – నాణ్యత లేని డిజైన్

సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన టి1 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ట్రంప్ మొబైల్ అనే సంస్థ ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇది కేవలం ఒక మార్కెటింగ్ స్టంట్‌గా మిగిలిపోయింది. 42 వేల రూపాయల ధరతో అమ్ముతున్న ఈ ఫోన్… నిజానికి వినియోగదారులను ఆకర్షించేలా ఏమాత్రం లేదు. ట్రంప్ పేరును వాడుకోవడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఫోన్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా…

Read More
Fauji in Ramoji Film City

ప్రభాస్ సినిమా సెట్‌లో ‘విషం’ – రామోజీ ఫిలిం సిటీలో విష పురుగుల కలకలం

సహనం వందే, హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ సెట్ల భద్రతపై అఖిల భారత సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో నటుడు రాజేష్ శర్మకు విషకీటకం కుట్టి ఆయన ప్రాణాపాయ స్థితికి చేరుకోవడమే ఈ వివాదానికి మూలం. సెట్లలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడం, పరిశుభ్రత నిబంధనలను విస్మరించడంపై సినీ వర్గాలు తీవ్ర…

Read More
Shiridi Sai Baba, మహారాష్ట్ర అసెంబ్లీకి షిర్డీ సాయిబాబా విరాళాల నివేదిక

అసెంబ్లీకి షిర్డీ సాయిబాబా! – ప్రజల ముందుకు ఆలయ విరాళాల నివేదిక

సహనం వందే, షిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం నిధుల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారిక లెక్కల ప్రకారం ఏడాదికి విరాళాలు, బ్యాంక్ వడ్డీల ద్వారా 850 కోట్ల రూపాయల భారీ ఆదాయం వస్తోంది. ఈ మొత్తం సొమ్మును ట్రస్ట్ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. భక్తుల నుంచి వస్తున్న ఈ భారీ విరాళాలు ఆలయ ప్రతిష్టను పెంచడమే కాకుండా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలకు బాటలు వేస్తున్నాయి. రామమందిర…

Read More
Religious Beliefs Vs Science, సైన్స్

సైన్స్ వైపు సంపన్నుల పరుగు – మత విశ్వాసాలు దాటి విజ్ఞాన శాస్త్ర బాట

సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా భారతదేశంలో దానాలు అంటే దేవాలయాలు, మత సంస్థలకే ప్రాధాన్యత ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేశపు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు తమ దృష్టిని దేవుడి నుంచి సైన్స్ ప్రయోగశాలల వైపు మళ్లిస్తున్నారు. భౌతిక శాస్త్రం, బయో టెక్నాలజీ, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు రంగాల్లో పెట్టుబడులు పెడుతూ దేశాభివృద్ధికి సరికొత్త శాస్త్రీయ పునాదులు వేస్తున్నారు. సరికొత్త శాస్త్రీయ విప్లవంకృత్రిమ మేథ, రోబోటిక్స్ లాంటి అత్యాధునిక ఆవిష్కరణల్లో భారత్ వెనుకబడుతోందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ…

Read More
చాక్లెట్ వాసనతో కండల వేట – జిమ్ వర్కవుట్ లో అద్భుతమైన మార్పు

చాక్లెట్ వాసనతో కండల వేట – జిమ్ వర్కవుట్ లో అద్భుతమైన మార్పు

సహనం వందే, హైదరాబాద్: జిమ్ కు వెళ్ళే కండల వీరులారా ఇకపై బరువులెత్తే ముందు ఒక ముక్క చాక్లెట్ తినాల్సిన పనిలేదు. కేవలం దాని వాసన చూస్తే చాలు మీ సామర్థ్యం రెట్టింపు అవుతుంది. అలసట తెలియకుండా కండరాలు ఉక్కులా తయారవుతాయి. శాస్త్రవేత్తలు తాజాగా చేపట్టిన పరిశోధనలో ఈ అద్భుతమైన నిజం వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ సైన్స్ రంగంలో ఇదొక కొత్త సంచలనం. పరిశోధనలో అద్భుత ఫలితాలుమలేషియాలోని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై లోతైన అధ్యయనం చేశారు. ఇందులో…

Read More
India doctors Face a Violence Crisis

తెల్ల కోటుపై రక్తపు మరకలు – దేశవ్యాప్తంగా 80 శాతం వైద్యులపై దాడులు

సహనం వందే, హైదరాబాద్: ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు నేడు ప్రాణరక్షణ కోసం పోరాడుతున్నారు. దేవుడితో సమానంగా చూసే వైద్య వృత్తిపై దాడులు పెచ్చరిల్లడం సమాజానికి చేటు తెస్తోంది. ఆసుపత్రులు ప్రాణదాతలకు వేదికలు కావాల్సింది పోయి, రణరంగాలుగా మారుతున్నాయి. వైద్యుల భయం, ఆందోళన చివరకు రోగులకే పెను శాపంగా పరిణమిస్తోంది. వైద్యులపై జరుగుతున్న దాడుల వెనుక ఉన్న భయంకరమైన వాస్తవాలు ఇప్పుడు నివ్వెరపరుస్తున్నాయి. వైద్య వృత్తిపై పెరిగిన ముప్పుదేశవ్యాప్తంగా 439 మంది వైద్యులపై నిర్వహించిన తాజా సర్వే వైద్య…

Read More
Top 20 Cities in the World

నగరం మధురమైన జీవితం – ప్రపంచంలో నివసించదగ్గ సిటీలు ఇవేనట

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచంలో మనుషులు హాయిగా జీవించడానికి ఏ నగరం అత్యంత అనుకూలమైనది? ఈ ప్రశ్నకు ప్రతి ఏటా సమాధానం వెతికే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, తాజాగా 2026 గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్‌ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 173 నగరాలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక… ఒక వైపు అద్భుతమైన జీవన ప్రమాణాలు, మరోవైపు యుద్ధం వల్ల చిన్నాభిన్నమైన నగరాల గతిని కళ్లకు కడుతోంది. కోపెన్‌హాగన్ జైత్రయాత్రడెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్ వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోనే…

Read More
Dubai

దుబాయ్ బాటలో టూరిస్టులు – యుద్ధ భయంతో తగ్గిన పర్యాటకం

సహనం వందే, హైదరాబాద్: ఇటీవలి వేసవి సెలవుల వేళ పర్యాటక రంగం కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. యుద్ధ మేఘాలు పర్యాటకుల నిర్ణయాలను శాసిస్తున్నాయి. ఒకప్పుడు ఖరీదైనవిగా భావించే దుబాయ్, ఈజిప్టులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ఐరోపా దేశాలు పర్యాటకుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ విచిత్రమైన పరిస్థితి వెనుక ఉన్న అసలు కారణాలను నిశితంగా పరిశీలిద్దాం. దుబాయ్ టూర్ ఇప్పుడు చౌకదుబాయ్, ఈజిప్టులలో పర్యాటక ప్యాకేజీలు పడిపోయాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు టూర్ ఆపరేటర్లు ధరలను…

Read More