తలవంచని నేల… చలించని జాతి – ఒక్కటైన ఇరాన్ దేశపు గుండె చప్పుడు
సహనం వందే, హైదరాబాద్: ఒక మనిషిని చంపవచ్చు కానీ అతను రగిలించిన ఆశయాన్ని చంపలేం. ఆకాశం నుండి కురుస్తున్న నిప్పుల వాన ఇరాన్ నేలను గాయపరుస్తోంది కానీ ఆ మట్టిపై ఉన్న మనుషుల సంకల్పాన్ని మాత్రం ఏమీ చేయలేకపోతోంది. బాంబుల మోత వినిపించని చోట కూడా ఇప్పుడు ఒక దేశపు ఆర్తనాదం ప్రతిధ్వనిస్తోంది. అది ఓటమి అంగీకరించే ఆర్తనాదం కాదు… తన ఉనికిని కాపాడుకోవాలన్న ఒక జాతి ఆక్రోశం. పోరాటంలో పుట్టిన నిశ్శబ్దంనాయకుడు లేని సమయంలో ప్రజలు…