CAS Twist

10 ఏళ్ల రూల్‌కు డీఎంఈ గ్రీన్ సిగ్నల్

సహనం వందే, హైదరాబాద్:కంటిన్యూయస్ అకడమిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) అమలుపై తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల కోరిక మేరకు డీఎంఈ కార్యాలయం స్పష్టత ఇచ్చింది. 10 ఏళ్ల సర్వీస్ నిబంధన విషయంలో 2006 నవంబర్ ప్రామాణికంగా తీసుకుని అప్పటికే అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో ఉన్నవారికి ఈ ప్రయోజనం వర్తిస్తుందని ప్రకటించారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏసీఆర్‌ల విషయంలో క్లారిటీ…ఇప్పటికే…

Read More
Sky Walk inn Vizag

దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన -కైలాసగిరి పర్వత శిఖరంపై అద్భుత నిర్మాణం

సహనం వందే, విశాఖపట్నం: భారతదేశంలోనే అతి పొడవైన గాజు ఆకాశ వంతెన (గ్లాస్ స్కైవాక్) ఇప్పుడు సాగర తీరం విశాఖపట్నంలో అందుబాటులోకి వచ్చింది. కైలాసగిరి పర్వత శిఖరంపై రెండు కొండల మధ్య నిర్మించిన ఈ వంతెన పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. సుమారు 120 మీటర్ల పొడవున్న ఈ గాజు వంతెన కింద నీలి సముద్రం కనిపిస్తుంటే సందర్శకులకు ఆకాశంలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతోంది. సాహసాలను, అద్భుతమైన దృశ్యాలను కోరుకునే యువతకు ఇది ఓ కొత్త గమ్యస్థానం….

Read More
Lead Actors

హీరో కాదు లీడ్ యాక్టర్ – సినీనటులను హీరోలని పిలవకూడదు

సహనం వందే, పల్నాడు:సినీ నటులను హీరోలు అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పదాన్ని వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. హీరో అనే పదం డ్రగ్స్ కంటే ప్రమాదకరమైందని, బాల్యం నుంచే యువత భవిష్యత్తును ఇది నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులు లేదా అన్నం పెట్టే రైతుల కంటే, తల్లిదండ్రుల కంటే కూడా సినీ నటులనే…

Read More
World AIDs Day

టార్గెట్ 2030… ఎయిడ్స్‌ ఎండ్ – ఐదేళ్లలో వ్యాధి పూర్తి నిర్మూలనే లక్ష్యం

సహనం వందే, హైదరాబాద్:భారతదేశం గత పదిహేనేళ్లలో హెచ్‌ఐవీ నియంత్రణలో విజయం సాధించింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు దేశ ఆరోగ్య రంగానికి పెద్ద బూస్ట్‌ ఇచ్చాయి. 2010 నుంచి 2024 మధ్య కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసుల్లో ఏకంగా 48.7 శాతం తగ్గుదల కనిపించింది. అలాగే ఎయిడ్స్ కారణంగా చనిపోయే వారి సంఖ్య 81.4 శాతం క్షీణించడం మరో గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు. సరైన…

Read More
వందేళ్ళ వైపరీత్యం

వందేళ్ళ వైపరీత్యం – పురుడు పోసుకుంటున్న నాటి వినాశనాలు

సహనం వందే, హైదరాబాద్: వైపరీత్యాలు ప్రతీ వందేళ్ళకోసారి పునరావృతం అవుతాయని అంటుంటారు.1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ప్రపంచంలో 50 కోట్ల మందిని ప్రభావితం చేసింది. కోట్ల మంది చనిపోయారు. దాదాపు అటువంటి వైరసే 2019లో వచ్చిన కరోనా. దీనివల్ల ఎన్ని కోట్ల మంది చనిపోయారో అందరికీ తెలుసు. అది సృష్టించిన మానవ విలయం ప్రతి కుటుంబానికి అనుభవంలోకి వచ్చిందే. అలాగే ఈ ఏడాది వాతావరణంలో వచ్చిన అసాధారణ పరిస్థితులు వందేళ్ళ రికార్డులను తిరగరాస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల…

Read More
Age wise alcohol usage

ఫుల్ బాటి(కి)ల్ – వయసు పెరిగే కొద్దీ మందు విషమే!

సహనం వందే, హైదరాబాద్: యుక్త వయసులో నాలుగు గ్లాసులు తాగినా తేలికగా పనిచేసే శరీరం… ఇప్పుడు రెండు గ్లాసులకే కళ్లు బైర్లు కమ్మి పడక చేరడానికి సిద్ధమవుతుందా? అయితే దానికి కారణం కేవలం వయసు మారుతూ ఉండటమే. వయసు పెరిగే కొద్దీ మందు మన శరీరంపై చూపే ప్రభావం కూడా తీవ్రంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీర్ణ వ్యవస్థ నెమ్మదించడం… ముఖ్యంగా కాలేయం (లివర్) పనితీరు మందగించడం ఇందుకు ప్రధాన కారణం. 50, 70 ఏళ్ల…

Read More
Nellore Lady Don

గంజాయి రాణి దారుణ హత్యలు – నెల్లూరులో సీపీఎం నేతను చంపిన కసాయి

సహనం వందే, నెల్లూరు:నెల్లూరు జిల్లా కల్లూరుపల్లికి చెందిన అరవ కామాక్షి అనే లేడీ డాన్ గంజాయి దందాకు అడ్డుగా వస్తున్నాడని భావించి సీపీఎం నాయకుడు కె. పెంచలయ్య (38)ను దారుణంగా హత్య చేయించింది. గంజాయి విక్రయాలను అడ్డుకుంటున్న పెంచలయ్యపై కక్ష పెంచుకున్న ఈ ముఠా గత శుక్రవారం సాయంత్రం ఆయన్ను అడ్డగించి కత్తులతో పొడిచి చంపింది. ఈ లేడీ డాన్ దందాలకు కొంతమంది పోలీసులు సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో నెల్లూరులో రౌడీయిజం, గంజాయి దందాలు…

Read More
Temple for Aliens

గ్రహాంతరవాసికి గుడి – ఇది తమిళనాడులో వింత!

సహనం వందే, తమిళనాడు:దేశంలో దేవాలయాలెన్నో చూశాం కానీ తమిళనాడులోని సేలంలో ఒక విచిత్రమైన గుడి వెలిసింది, ఇందులో ఏకంగా గ్రహాంతరవాసి (ఏలియన్) విగ్రహం ప్రతిష్టించారు. మల్లామూపంపట్టికి చెందిన లోగనాథన్ అనే వ్యక్తికి కలలో కనిపించిన నల్లని గ్రహాంతరవాసిని దేవతగా భావించి భూమికి 11 అడుగుల లోతులో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శివుడు సృష్టించిన తొలి దేవత ఇదేనని… ఈ విగ్రహం భక్తులను, ప్రపంచాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుందని లోగనాథన్ ప్రచారం చేస్తున్నాడు. ఈ వింత ఆలయ…

Read More
LIC hands of Adani & Ambani

ఇద్దరి గుప్పిట్లోకి సామాన్యుడి ‘లైఫ్’ – ఆదానీ, అంబానీ కాళ్ల దగ్గర ప్రజల సొమ్ము

సహనం వందే, న్యూఢిల్లీ: కోట్ల మంది సామాన్యుల జీవిత భద్రతకు నిలయమైన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వ్యవహారం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. గత మూడున్నర సంవత్సరాలుగా ఎల్‌ఐసీ తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలను పరిశీలిస్తే అత్యంత రహస్యమైన కుట్ర బయటపడింది. దేశాన్ని ప్రభావితం చేసే అదానీ, రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ ప్రతిపాదన తెచ్చినా ఎల్‌ఐసీ వాటికి ఏకపక్షంగా, ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్తి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని తీర్మానాలకు…

Read More
Sarpanch Suicides

సర్పంచుల సమాధిపై పల్లెప్రగతి! – 60 మంది ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల వేళ గత ఐదేళ్ల పాలనలో జరిగిన దారుణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పల్లెప్రగతి పేరుతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సర్పంచులపై పెట్టిన తీవ్ర ఒత్తిడి ఫలితంగా కనీసం 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల మాట పక్కన పెడితే ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఇంత పెద్ద సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళనకరం. గ్రామపంచాయతీ…

Read More