Temple for Aliens

గ్రహాంతరవాసికి గుడి – ఇది తమిళనాడులో వింత!

సహనం వందే, తమిళనాడు:దేశంలో దేవాలయాలెన్నో చూశాం కానీ తమిళనాడులోని సేలంలో ఒక విచిత్రమైన గుడి వెలిసింది, ఇందులో ఏకంగా గ్రహాంతరవాసి (ఏలియన్) విగ్రహం ప్రతిష్టించారు. మల్లామూపంపట్టికి చెందిన లోగనాథన్ అనే వ్యక్తికి కలలో కనిపించిన నల్లని గ్రహాంతరవాసిని దేవతగా భావించి భూమికి 11 అడుగుల లోతులో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శివుడు సృష్టించిన తొలి దేవత ఇదేనని… ఈ విగ్రహం భక్తులను, ప్రపంచాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుందని లోగనాథన్ ప్రచారం చేస్తున్నాడు. ఈ వింత ఆలయ…

Read More
LIC hands of Adani & Ambani

ఇద్దరి గుప్పిట్లోకి సామాన్యుడి ‘లైఫ్’ – ఆదానీ, అంబానీ కాళ్ల దగ్గర ప్రజల సొమ్ము

సహనం వందే, న్యూఢిల్లీ: కోట్ల మంది సామాన్యుల జీవిత భద్రతకు నిలయమైన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ వ్యవహారం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. గత మూడున్నర సంవత్సరాలుగా ఎల్‌ఐసీ తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలను పరిశీలిస్తే అత్యంత రహస్యమైన కుట్ర బయటపడింది. దేశాన్ని ప్రభావితం చేసే అదానీ, రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏ ప్రతిపాదన తెచ్చినా ఎల్‌ఐసీ వాటికి ఏకపక్షంగా, ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్తి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని తీర్మానాలకు…

Read More
Sarpanch Suicides

సర్పంచుల సమాధిపై పల్లెప్రగతి! – 60 మంది ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక ఎన్నికల వేళ గత ఐదేళ్ల పాలనలో జరిగిన దారుణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పల్లెప్రగతి పేరుతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సర్పంచులపై పెట్టిన తీవ్ర ఒత్తిడి ఫలితంగా కనీసం 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల మాట పక్కన పెడితే ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఇంత పెద్ద సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళనకరం. గ్రామపంచాయతీ…

Read More
AI Dolls to Elderly People

అమ్మమ్మకు ‘ఏఐ’ బొమ్మ… వృద్ధాప్యంలో తోడు – వయసు పైబడిన వారికి మాట్లాడే బొమ్మలు

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఇప్పుడు వృద్ధుల మానసిక ఆరోగ్యం ఒక పెద్ద సమస్యగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలలోకెల్లా ఇక్కడే వృద్ధులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజూ సుమారు 10 మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరియా వేగంగా అతి-వృద్ధ సమాజంగా మారిపోయింది. దేశ జనాభాలో దాదాపు ఐదో వంతు 65 ఏళ్లు పైబడిన వారే. దీంతో కుటుంబ…

Read More
Sandeep Sandilya IPS

‘చెత్త’ వాడితో ఐపీఎస్ దోస్తీ – ఢిల్లీలో మారువేషంలో ఏడు రోజులు

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా నడుపుతున్న భారీ నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ బృందం, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఛేదించాయి. ఈ మెగా ఆపరేషన్ విజయానికి ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఐపీఎస్ చేపట్టిన సాహసోపేతమైన అండర్‌కవర్ మిషన్. ఈ డ్రగ్స్ దందా మూలాలను వెలికితీయడానికి ఆయన ఏకంగా ఏడు రోజులపాటు మారువేషంలో నైజీరియన్ల డ్రగ్స్ అడ్డాలోనే మకాం వేశారు. ఈ బృందం స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా…

Read More
ED Rides on Medical Colleges

మెడికల్ కాలేజీలపై ఈడీ దెబ్బ- దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో దాడులు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా ఝులిపిస్తుంది. మెడికల్ కాలేజీల అనుమతులు, సీట్ల సంఖ్య పెంపు కోసం ఎన్‌ఎంసీలోని కొందరు ఉన్నతస్థాయి అధికారులు కోట్లకు కోట్లు లంచం తీసుకున్నారన్న అనుమానంతో గురువారం ఈడీ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద వైద్య విద్యా సామ్రాజ్యాలు ఈ దాడుల్లో చిక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌మనీ…

Read More
Billionaires Leaves India

దేశం విడిచిపోతున్న ధనలక్ష్మి – విదేశాలకు వెళ్లిపోతున్న బిలియనీర్లు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత ధనవంతులు… బిలినియర్లు… పారిశ్రామికవేత్తలు కట్టకట్టుకుని ఎందుకు విదేశాలకు వెళ్తున్నారు? ఈ ప్రశ్నకు ఆర్థిక సలహాదారు అక్షత్ శ్రీవాస్తవ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. వీరు పన్నుల నుంచి తప్పించుకోవడానికో ఇంకేదో కాదు. తమ కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాల కోసమే విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశానికి ఇది నిజంగా సిగ్గుచేటు. వ్యవస్థలోని లోపాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశ ఆర్థిక భవిష్యత్తుకు…

Read More
Online platform Food Safety Inspection

ఆన్ లైన్ లో సరు’కుళ్లు’- బ్లింక్ ఇట్, జెప్టో, జొమాటోల నాసిరకం సప్లై

సహనం వందే, హైదరాబాద్: ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో మనం నిత్యం కొనే సరుకులు ఎంతవరకు సురక్షితం? తాజా తనిఖీల్లో వెల్లడైన వివరాలు వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ జియోమార్ట్, జెప్టో, బ్లింక్ ఇట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల స్టోరేజ్ సెంటర్లు, గోదాముల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఎంత దారుణంగా ఉల్లంఘనకు గురవుతున్నాయో ఈ దాడులు బట్టబయలు చేశాయి. గడువు ముగిసిన, నాణ్యత లేని సరుకులను అమ్ముతూ ఈ సంస్థలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయనే…

Read More
One Dollar reaches Rs.89.48

రూపాయి ‘క్రాష్’తో ఆర్థిక విధ్వంసం – కాపాడే ఆర్థిక వైద్యులు ఎవరు?

సహనం వందే, ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ. 89.48 దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… దేశ ఆర్థిక శక్తికి అద్దం పట్టే చేదు నిజం. రూ. 90 అనే ముఖ్యమైన మార్క్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ మార్కెట్లోకి డాలర్లు అమ్మి రూపాయిని పైకి లేపే ప్రయత్నం చేసినా…

Read More
Uranium in Mothers' Milk in Bihar

తల్లి పాలలో విషపు జాడలు – ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో దారుణ నిజాలు

సహనం వందే, బీహార్: పిల్లలకు అమృతం వంటి తల్లి పాలే ఇప్పుడు విషంగా మారిపోయాయి. పసికందుల నోటిలోకి పాలు కాదు… నిశ్శబ్దంగా యురేనియం వంటి ప్రాణాంతక విషాన్ని చేరుస్తున్న అత్యంత భయంకరమైన నిజాన్ని ఒక కొత్త అధ్యయనం బట్టబయలు చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి సేకరించిన తల్లి పాలలో యూరేనియం జాడలు కనిపించడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో… పౌరుల ప్రాథమిక ఆరోగ్య భద్రతకు ఎంత ముప్పు పొంచి ఉందో తెలియజేస్తోంది….

Read More