‘చెత్త’ ఆహారం… కొత్త వ్యాపారం! – పారేయాల్సిన ఆహారం చౌకగా విక్రయం
సహనం వందే, హైదరాబాద్: బేకరీలు, రెస్టారెంట్లలో రోజంతా అమ్మకాలు ముగిశాక మిగిలిపోయే కేకులు, బ్రెడ్లు, పఫ్‌లను మరుసటి రోజు అమ్మలేక నిర్వాహకులు చెత్తబుట్టలో పారేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ మిగులు ఆహారమే ‘సర్‌ప్రైజ్ బ్యాగ్స్’ పేరుతో కొత్త వ్యాపారానికి మార్గం చూపిస్తోంది. ప్రత్యేక మొబైల్ యాప్‌ల ద్వారా సమీపంలోని బేకరీలు, కేఫ్‌లలో మిగిలిన ఆహార సంచులను బుక్ చేసుకుని, ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించాక వచ్చే కోడ్ చూపించి దుకాణంలో నేరుగా తీసుకోవచ్చు. ఏ దుకాణం నుంచి సంచి…