Thomas Guthrie CEO Runwise

స్కూల్ బ్యాగ్… సీఈఓ ట్యాగ్ – రన్‌వైజ్ ఏఐ కంపెనీతో టీనేజీ విప్లవం

సహనం వందే, కెనడా: సాంకేతిక ప్రపంచంలో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. అనుభవానికి అర్థం మారుతోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతిభే పెట్టుబడిగా కొత్త సామ్రాజ్యాలు వెలుస్తున్నాయి. 15 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఒక ఏఐ కంపెనీని స్థాపించి తనకంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని ఉద్యోగిగా నియమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక నియామకం మాత్రమే కాదు భవిష్యత్తు ఉపాధి రంగంలో రాబోతున్న పెను మార్పులకు నిదర్శనం. యువ సీఈఓ థామస్ గుత్రీఈ కథనానికి కథానాయకుడు థామస్ గుత్రీ…

Read More
MP appalanaidu

ఖబరస్థాన్‌కు అప్పలనాయుడు అభయం – ప్రహరీ గోడకు ప్రాణం.. ఎంపీ కలిశెట్టి చిత్తశుద్ధి

సహనం వందే, విజయనగరం: రంజాన్ పవిత్ర మాసంలో ప్రార్థనలు కేవలం మసీదులకే పరిమితం కావు. అవి తోటి మనుషుల కష్టాలను గుర్తించే కరుణగా మారాలి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సరిగ్గా అదే బాటలో నడిచారు. ముస్లిం సోదరుల దశాబ్దాల కష్టాలను స్వయంగా చూసి తక్షణమే నిధులను కేటాయించి అందరి మన్ననలు పొందారు. పవిత్ర సందర్శనరంజాన్ పండుగను పురస్కరించుకొని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఖబరస్తాన్‌ను సందర్శించారు. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే…

Read More
WhatsAPP without Number

నెంబర్ లేకుండా వాట్సాప్ చాటింగ్ – ఫోన్ నంబర్ బదులు యూజర్ నేమ్స్

సహనం వందే, హైదరాబాద్: వాట్సాప్ తన పునాదులనే మార్చేస్తోంది. ఫోన్ నంబర్ లేని లోకంలోకి మనల్ని తీసుకెళ్తోంది. కేవలం ఒక యూజర్ నేమ్ ఉంటే చాలు.. ప్రపంచంతో కనెక్ట్ అయిపోవచ్చు. భద్రతకు పెద్దపీట వేస్తూ మెటా తీసుకున్న ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతోంది. ఇది కేవలం అప్‌డేట్ కాదు.. ఒక డిజిటల్ విప్లవం. నెంబర్ల కాలం చెల్లిందివాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్ పనితీరులో భారీ మార్పునకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఫోన్ నంబర్ ఉంటేనే మెసేజ్‌లు…

Read More
Shanghai Marriage Market

మ్యారేజీ టూరిజం – చైనాలో వారాంతంలో పెళ్లి సంత

షాంఘై పీపుల్స్ పార్కులో ప్రేమకు తావులేదు. అక్కడ ప్రతి శని, ఆదివారాలు ఒక వింత సంత జరుగుతుంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు ఇక్కడ ప్రకటన బోర్డులు పట్టుకుని వేచి చూస్తారు. అది ఒక సామాజిక వేదికలా కనిపిస్తున్నా… దాని వెనుక కన్నవారి తీరని ఆవేదన దాగి ఉంది. అంకెల గాలిలో మనుషుల విలువలు మాయమై పెళ్లి అనేది కేవలం ఒక ఆర్థిక ఒప్పందంగా మారిపోయింది. బోర్డులపైనే కొలువుల లెక్కలుషాంఘైలోని పీపుల్స్ పార్కులో…

Read More
Dhurandhar Jamali role

పాకిస్తానీ నేతకు ధురంధర్ దడ – భారత్ గూఢచారి అంటూ పాక్ లో విమర్శలు

సహనం వందే, హైదరాబాద్: వెండితెర మీద గూఢచారి సాహసాలు చూసి జనం ఈలలు వేస్తారు. కానీ అదే వెండితెర సృష్టించిన సెగ ఇప్పుడు సరిహద్దు అవతల ఒక రాజకీయ నేతను వణికిస్తోంది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ స్పై థ్రిల్లర్ ఒకవైపు వాస్తవ వీరుడి త్యాగాన్ని స్మరింపజేస్తుంటే… మరోవైపు పాకిస్థాన్ రాజకీయాల్లో పెను తుఫాను రేపుతోంది. రీల్ లైఫ్ పాత్రకు, రియల్ లైఫ్ హీరోకు మధ్య ఉన్న ఈ ఆసక్తికర పోలికలే ఇప్పుడు హాట్ టాపిక్. గబోల్…

Read More
Norway Princess and Epstein

ఎప్‌స్టీన్ కౌగిలిలో నార్వే రాణి – బయటపడ్డ రహస్య ఈమెయిల్స్

సహనం వందే, నార్వే: విలాసవంతమైన జీవితం వెనుక దాగివున్న చీకటి కోణాలు ఇప్పుడు నార్వే రాజకుటుంబాన్ని కుదిపేస్తున్నాయి. అంతర్జాతీయ కామాంధుడు ఎప్‌స్టీన్ వలలో చిక్కుకున్నానని నార్వే రాకుమారి మెట్టె మారిట్ కన్నీరు పెట్టుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నమ్మించి మోసం చేశారనే వాదనతో ఆమె తన పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బయటపడుతున్న ఆధారాలు మాత్రం రాజవంశపు పునాదులను కదిలిస్తున్నాయి. మాయలో మారిట్రాకుమారి మెట్టె మారిట్ తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో సంచలన నిజాలు చెప్పారు. ఎప్‌స్టీన్…

Read More
Iftar party in 'Ganga River

గంగలో ‘బిర్యానీ’ – కాశీలో ఇఫ్తార్ విందు కల్లోలం

సహనం వందే, వారణాసి: పవిత్ర గంగా నది సాక్షిగా సాగిన ఒక విందు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఆకలి తీర్చుకోవడం నేరమా లేక నదీ గర్భంలో నిబంధనలు ఉల్లంఘించడం పాపమా అన్న చర్చ మొదలైంది. రాజకీయం, మతం కలగలిసిన ఈ ఉదంతం చివరకు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కడం గమనార్హం. పడవపై విందు రాజకీయంఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని గంగా నదిలో పడవపై ఇఫ్తార్ విందు జరిగింది. కొంతమంది యువకులు కలిసి పడవలో కూర్చుని చికెన్…

Read More
Modi appears in Dhurandhar

‘ధురందర్’లో మోడీ ధూమ్ ధామ్ – వెండి తెరపై ప్రధాని మెరుపులు

సహనం వందే, హైదరాబాద్: బాలీవుడ్ వెండితెరపై పొలిటికల్ సెన్సేషన్ రిపీట్ అవుతోంది. ధురందర్ 2 సినిమాలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించడంతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. కేవలం అతిథి పాత్రలకే పరిమితం కాకుండా కథలో భాగంగా వచ్చిన ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. సినిమాలకు రాజకీయాలకు ఉన్న విడదీయలేని బంధాన్ని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. థియేటర్లలో పూనకాలుఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ధురందర్ ది రివెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సీక్వెల్ సినిమాలో…

Read More
Sahanamvande 1 Year

పాఠకులకు ‘సహనం వందనం’ – ఏడాది ప్రయాణం… అక్షర సంతకం

కళ్లు మూసి తెరిచేలోగా వార్తలు మారిపోయే కాలమిది. సముద్రపు అలల కంటే వేగంగా సమాచారం ముంచెత్తుతోంది. కానీ ఆ అంతులేని హోరులో నిజమైన నిశ్శబ్దం ఎక్కడ? మనసును తాకే మనిషి కథ ఎక్కడ? సరిగ్గా ఏడాది క్రితం ఒక చిన్న విత్తనం పడింది. అదే సహనం వందే. ఇది కేవలం వార్తా సంస్థ కాదు. అబద్ధాల అడవిలో నిజాయితీగా వేసిన ఒక అడుగు. నిరంతరం ప్రవహించే వార్తల వెల్లువలో తనదైన ముద్ర వేస్తూ… సామాన్యుడి గొంతుకగా మారి…

Read More
Social Media Vs Women

కుంగుబాటులో కోమలాంగులు – హ్యాపీ’లెస్’… అమ్మాయి క్రష్

అరచేతిలోని రంగుల ప్రపంచం అడపిల్లల కొంపముంచుతోంది. అందమైన బొమ్మల వెనుక అగాధాలు పొంచి ఉన్నాయి. అల్గారిథమ్ రాక్షసి టీనేజ్ అమ్మాయిల మనసులను పిండేస్తోంది. పశ్చిమ దేశాల్లో మొదలైన ఈ మంటలు ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. సంతోషం ఉండాల్సిన చోట సత్తువ లేని దిగులు పేరుకుపోతోంది. ఆనందపు జెండా ఎగరాల్సిన చోట ఒంటరితనం తాండవిస్తోంది. డిజిటల్ మాయాజాలండిజిటల్ ప్రభావం అబ్బాయిల కంటే అమ్మాయిలపై ఎక్కువగా ఉంది. పాశ్చాత్య దేశాల్లోని టీనేజ్ అమ్మాయిలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అల్గారిథమ్…

Read More