బాసుల జీతం వంద రెట్లు అధికం – సీఈవోలు, ఉద్యోగుల మధ్య వేతనాల్లో భారీ అంతరం
సహనం వందే, హైదరాబాద్: భారత కార్పొరేట్ రంగంలో సీఈవోల వేతనాలు, సాధారణ ఉద్యోగుల సంపాదన మధ్య వ్యత్యాసం ఊహకందని విధంగా పెరుగుతోంది. ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పటికీ, సంస్థలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొద్దిమంది ఉన్నతాధికారుల సంపద దూసుకుపోతుండగా, కష్టపడే సాధారణ ఉద్యోగుల వేతనాలు నత్తనడకన సాగుతున్నాయని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో వేతనాల అంతరంబీఎస్‌ఈ 500 సూచీలోని 232 కంపెనీల వార్షిక నివేదికలను పరిశీలించగా, దాదాపు సగం సంస్థల బాసుల వేతనం సగటు ఉద్యోగి…