సాఫ్ట్‌వేర్ ఉద్యోగం… హీరోయిన్ అవకాశం – అమెరికా నుంచి ‘ఆకాశంలో ఒక తార’
సహనం వందే, హైదరాబాద్: అమెరికాలోని చికాగోలో పుట్టి పెరిగిన సాత్విక వీరవల్లికి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే ఆలోచన లేదు. కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలో కుటుంబ మూలాలున్న ఆమె తండ్రి, చదువుల కోసం తొలుత హైదరాబాద్‌కు వచ్చి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ఇంట్లో తెలుగు, తమిళ సంప్రదాయాల వాతావరణం ఉండగా, తమిళ సంస్కృతిపై ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. గత రెండేళ్లుగా తెలుగు భాష నేర్చుకుంటున్న సాత్విక, ఉన్నత చదువులు పూర్తి చేసి ఐటీ ఉద్యోగంలో…