‘రాజీవ్’ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) – 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు

సహనం వందే, న్యూఢిల్లీ:1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయిలో 414 సీట్ల విజయాన్ని అందించింది కేవలం ఇందిరా గాంధీ సానుభూతి మాత్రమే కాదు… ఆ విజయం వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మద్దతు ఉందన్న తాజా సమాచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీని పక్కనబెట్టి ఇందిర హత్య తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీకి ఆర్ఎస్ఎస్ నాయకత్వం రహస్యంగా చేయూతనిచ్చిన వైనం ఆసక్తికరమైన రాజకీయ మలుపు. బీజేపీ పుట్టి…

Read More

కాటేస్తున్న కాలేజీలు – రేప్ సంఘటనలతో దేశం ఉక్కిరిబిక్కిరి

సహనం వందే, న్యూఢిల్లీ:వారం రోజుల క్రితం కోల్ కతాలో మెడికో పై అత్యాచారం… ఆ సంఘటన మరువకముందే బెంగళూరులో తాజాగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక విద్యార్థినిపై క్యాంపస్ టాయిలెట్స్ లోనే అత్యాచారం చేసిన ఘటన నివ్వెర పరుస్తుంది. అంతకుముందు ఆరు నెలల క్రితం కోల్ కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో రేప్… హత్య జరిగింది. ఇలా కాలేజీ క్యాంపస్ లు అత్యాచారాలకు నిలయాలుగా మారడంపై దేశం యావత్తు ఉలిక్కిపడింది. ఇంత జరుగుతుంటే నిందితులు మాత్రం…

Read More

వీసా బజార్‌… ఇండియా లూజర్! – ప్రపంచంలో భారత పాస్‌పోర్ట్‌ పతనం

సహనం వందే, లండన్:అంతర్జాతీయ స్థాయిలో భారత పాస్‌పోర్ట్‌ విలువ భారీగా పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు ఏకంగా 85వ స్థానానికి దిగజారింది. గతంలో 77వ ర్యాంకు ఉండగా..‌. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడానికి అంతర్జాతీయ స్థాయిలో సరిహద్దు నిబంధనలే కారణమని లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ కన్సల్టెన్సీ నివేదించింది. 2006లో 71వ స్థానంలో ఉన్న భారత్, 2015లో 88, 2021లో 90 వంటి అత్యంత కనిష్ట స్థాయులను చవిచూసి……

Read More

కర్ణాటకలో ‘గూగుల్’ గోల – బెంగళూరులో వైజా’గూగుల్’ ప్రకంపనలు

సహనం వందే, అమరావతి:విశాఖపట్నంలో ‘గూగుల్’ ఏఐ హబ్ ఏర్పాటుకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై జనతాదళ్ (సెక్యులర్) పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. బెంగళూరులో ఉన్న అత్యంత దారుణమైన రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సమస్యలు వ్యాపార వర్గాలను విసిగించాయని… అందుకే గూగుల్ సంస్థ విశాఖపట్టణంలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపిందని జేడీఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే బెంగళూరు తన వ్యాపార సౌహార్ద్రతను కోల్పోయి అంతర్జాతీయ పోటీలో…

Read More

‘కారం’తో రగిలిన కోల్ కతా – పశ్చిమబెంగాల్లో మిరప పొడితో నిరసన

సహనం వందే, కోల్ కతా:పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయంటూ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు వినూత్న నిరసనకు తెరతీశారు. దుర్గాపూర్ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను అస్త్రంగా చేసుకుని కోల్‌కతా సాల్ట్ లేక్ మెట్రో స్టేషన్ వద్ద మహిళలకు ఎర్ర మిరప పొడి ప్యాకెట్లు పంచారు. ఈ ఆపరేషన్ లాల్ మిర్చి పేరుతో చేపట్టిన…

Read More

‘ఆర్ఎస్ఎస్’ పై కేరళ టెక్కీ సూసైడ్ బాంబ్

సహనం వందే, న్యూఢిల్లీ:కేరళకు చెందిన ఒక ఐటీ ఇంజనీర్ అనందు అజి ఆత్మహత్య దేశ రాజకీయాలను ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూలాలను కుదిపేస్తోంది. అనందు రాసిన 15 పేజీల సూసైడ్ నోట్ బయటపడటంతో ఇది కేవలం మానసిక ఆరోగ్య సమస్యగా కాకుండా ఒక సంస్థాగత విషాదంగా మారింది. బాల్యంలో ‘ఆర్ఎస్ఎస్’ శిబిరాల్లో, సభ్యుల చేతుల్లో తాను లైంగిక, శారీరక వేధింపులకు గురయ్యానని, తన శరీరాన్ని ఆటవస్తువుగా ఉపయోగించుకున్నారని, బ్యాటన్‌లతో కొట్టేవారని ఆ యువకుడు ఆరోపించడంతో…

Read More

ఏ దారి ఎటు పోతుందో! – స్వదేశీ ‘మ్యాపుల్స్’ మహాద్భుతం!

సహనం వందే, హైదరాబాద్:గూగుల్‌ మ్యాప్‌కు గట్టి పోటీనిస్తూ మ్యాప్స్‌ మై ఇండియా సంస్థ రూపొందించిన ‘మ్యాపుల్స్’ యాప్‌ ఆకర్షిస్తుంది. మన రోడ్ల సంక్లిష్టతకు అనుగుణంగా తయారుచేసిన ఈ నావిగేషన్ యాప్ 3.5 కోట్ల డౌన్‌లోడ్లతో దూసుకుపోవడమే కాకుండా గోప్యత, భద్రతకు పెద్దపీట వేస్తుంది. ఇస్రో భాగస్వామ్యంతో ఉపగ్రహ చిత్రాల డేటాను ఉపయోగించుకోవడం ద్వారా మ్యాప్ ఖచ్చితత్వాన్ని అమాంతం పెంచింది. 13 అద్భుత ఫీచర్లు…ఇందులో 13 అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లు, ఓవర్‌బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల వద్ద మూడు డైమెన్షనల్…

Read More

ఏడు అడుగులకు… అరవై లక్షలు – అబ్బాయిలకు మ్యారేజ్ బ్యూరో కండీషన్

సహనం వందే, హైదరాబాద్:పెళ్లి అనేది రెండు మనసుల కలయిక అని మన సంప్రదాయం చెబుతోంది. కానీ‌ ఏఐ యుగంలో పెళ్లి సంబంధాలు కూడా పక్కా వ్యాపారంగా మారిపోయాయని ఒక కొత్త పరిణామం రుజువు చేస్తోంది. దేశంలో పెళ్లి సంబంధాల కోసం ఏర్పాటు అయిన నాట్(Knot) డేటింగ్ యాప్… అబ్బాయిల వార్షిక ఆదాయం కనీసం రూ. 60 లక్షలు ఉండాలని కఠిన షరతు విధించింది. అమ్మాయిలకు మాత్రం ఎలాంటి ఆదాయ పరిమితి పెట్టకుండా వివాదానికి కేంద్రంగా మారింది. సంప్రదాయ…

Read More

కులోన్మాదం… ఐపీఎస్ ఆత్మ’బలి’దానం- డీజీపీ స్థాయి అధికారిపైనే దళిత వివక్ష

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో కులం అనే విషం ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి నిరూపించే దారుణ ఘటన ఇది. హర్యానాలో సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పురాణ్ కుమార్ ఆత్మహత్య కేవలం ఒక వ్యక్తి విషాదాంతం కాదు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఒక దళిత అధికారి తన తోటి అధికారుల చేతిలో మానసిక హింసకు, జాతి వివక్షకు ఎలా బలైపోయాడో తెలిపే పచ్చి నిజం. చండీగఢ్‌లోని తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణం చెందడం దేశంలోని…

Read More

ప్రైవేట్ క్యాబ్… మహిళల ట్రాప్ – యూపీఐ చెల్లింపులతో లీకవుతున్న నంబర్లు

సహనం వందే, న్యూఢిల్లీ:క్యాబ్‌లలో ప్రయాణించే మహిళల భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. ఓలా, ఉబర్, ఇన్‌డ్రైవ్, రాపిడో వంటి ప్రైవేటు రవాణా యాప్‌లు ఎంత గొప్ప భద్రతా హామీలు ఇచ్చినా… డ్రైవర్ల వేధింపులు ఆ హామీల డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ముఖ్యంగా యూపీఐ ద్వారా డబ్బు చెల్లించడం వల్ల మహిళల వ్యక్తిగత ఫోన్ నంబర్లు డ్రైవర్లకు లీక్ అవుతున్నాయి. దానిని అడ్డుపెట్టుకుని వారు వాట్సాప్ లేదా పేటీఎం వంటి వాటిలో అసభ్యకర సందేశాలు పంపడం… వేధించడం సమస్యగా…

Read More