భార్య శవంతో బైకుపై పోలీస్ స్టేషన్కు..! – హత్య చేసి లొంగిపోయిన భర్త
సహనం వందే, బాపట్ల: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపిన ఓ హంతకుడు చేసిన పని ఉలికిపాటుకు గురిచేసింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి హతమార్చిన భర్త వెంకటేశ్వర్లు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆ మృతదేహాన్ని తన బైకుపై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఈ దృశ్యం చూసి పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక మనిషి ఇంత దారుణంగా వ్యవహరించడం సమాజంలో పెరిగిపోతున్న…