టీ న్యూస్ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్:ప్రముఖ టీ న్యూస్ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న స్వేచ్చ ఆత్మహత్య చేసుకుంది. ఆమె రామ్‌నగర్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్చ తన తల్లి శ్రీదేవితో కలిసి నివాసం ఉంటుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read More