Poor People Houses

గూడు చెదిరె… గుండె పగిలె – దేశంలో ఏడేళ్లలో రెట్టింపైన ఇళ్ల కూల్చివేతలు

సహనం వందే, న్యూఢిల్లీ: అభివృద్ధి ముసుగులో పేదవాడి సొంతింటి కల కల్లలవుతోంది. నగరాల సుందరీకరణ పేరిట బుల్డోజర్లు పేదల గుడిసెలను నేలమట్టం చేస్తున్నాయి. ఏళ్ల తరబడి నివసిస్తున్న చోట నుంచి కనికరం లేకుండా గెంటేస్తున్నారు. అధికార గర్వంతో పాలకులు చేస్తున్న ఈ దాడులు మానవ హక్కులను కాలరాస్తున్నాయి. గూడు కోల్పోయిన గుండెల్లో ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఇది కేవలం ఇళ్ల కూల్చివేత కాదు.. సామాన్యుడి ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడి. రెట్టింపైన విధ్వంసం…గడిచిన 7 ఏళ్ల కాలంలో దేశంలో…

Read More
Temple tourism

ముక్తి కోసం భక్తి మార్గం – దేశంలో ఆధ్యాత్మిక హోరు… టూరిజం జోరు

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గడచిన కొన్నేళ్లుగా భక్తి మార్గంలో ప్రయాణించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేవాలయాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటక రంగం కళకళలాడుతోంది. కేవలం వినోదం కోసమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం భక్తులు పుణ్యక్షేత్రాల బాట పడుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తోంది. అయోధ్యలో రికార్డుల వేటరామ్ లల్లా కొలువుదీరిన అయోధ్య ఇప్పుడు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా…

Read More
D Vitamin deficiency Dengue severe

డీ-లోపం… డెంగీ తీవ్రం – ఐసీఎంఆర్ పరిశోధనలో తేలిన చేదు నిజం

సహనం వందే, హైదరాబాద్: దోమ కాటుతో వచ్చే డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. కొందరిలో సాధారణ జ్వరంగా తగ్గిపోతుంటే మరికొందరిలో ఎందుకు తీవ్రమవుతోంది అన్నది మిస్టరీగా మారింది. దీనిపై శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనల్లో విటమిన్ డీ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ అంశాల గురించి భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధ్యయన నివేదిక విస్తుపోయే అంశాలను వెల్లడించింది. ఆ నివేదికపై గాంధీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కిరణ్ మాదలతో ‘సహనం వందే’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది….

Read More
Dr.Kiran Madala press Note

డాక్టర్ల డిమాండ్లపై కి’రణ్’ మాదల – వైద్య ఆరోగ్యశాఖ తీరుపై మండిపాటు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాణాలు కాపాడే డాక్టర్లు తమ డిమాండ్లపై రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. బకాయిల కోసం విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వైద్యుల గోడును పట్టించుకోని సర్కారు తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందని ఎరియర్స్తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ మాదల తమ న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తారు. యూజీసీ పీఆర్సీ బకాయిలు 2016 నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం 2024లో జీవో…

Read More
OSHO Teachings

‘జీరో’లోనే జీవితం – ఓషో బోధనల వెనుక అసలు రహస్యం

సహనం వందే, హైదరాబాద్: నేడు మనిషి పరుగుల ప్రపంచంలో పడి తనను తాను మర్చిపోతున్నాడు. సమాజం నేర్పిన అహంకారం, అసూయల మధ్య నలిగిపోతున్నాడు. ఈ క్రమంలో ఆధ్యాత్మిక గురువు ఓషో బోధనలు మనిషిని మేల్కొలిపేలా ఉన్నాయి. ఓషో దృష్టిలో అసలైన జీవితం అంటే ఏమిటో చూద్దాం. అహంకారం ఒక ముసుగు…మనిషి తనలోని లోపాలను దాచుకోవడానికి ధరించే ముసుగే అహంకారమని ఓషో చెప్పారు. పక్షులు, జంతువులకు అహంకారం ఉండదు. ఇది కేవలం మనిషి సృష్టించుకున్న ఒక జబ్బు. చిన్నప్పటి…

Read More
Digvijay Singh Vs Revanth Reddy

దిగ్విజయ్ సింగ్ వర్సెస్ రేవంత్ రెడ్డి – కాంగ్రెస్ పార్టీలో కాషాయ మంటలు

సహనం వందే, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. బీజేపీ, ఆరెస్సెస్ సంస్థాగత బలాన్ని ఆయన కొనియాడగా… దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోనియాగాంధీ నాయకత్వం వల్లే సామాన్యులు ప్రధానులు అయ్యారని రేవంత్ బదులిచ్చారు. దిగ్విజయ్ సింగ్ సంచలన పోస్ట్రాజ్యసభ సభ్యుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఎక్స్…

Read More
Maoist

మావోయిజంలో ఎండమావులు – తుపాకీ గొట్టంతోనే మార్పు అంటూ స్లో’గన్’

సహనం వందే, హైదరాబాద్: అడవి బాట పడితే అద్భుతాలు జరుగుతాయని కొందరు నమ్ముతారు. తుపాకీ పడితేనే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల అనుభవాల ద్వారా వారి జీవితాల్లోని అసలు నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఆదర్శాల ముసుగులో అన్యాయంమావోయిస్టు ఉద్యమం ఆరంభంలో గొప్ప ఆదర్శాలతో మొదలైంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా అడవి బాట పట్టారు. కానీ కాలక్రమేణా ఆ లక్ష్యాలు పక్కకు వెళ్లాయి. సాధారణ ప్రజలను రక్షించాల్సిన…

Read More
Govt.Doctors Dharna

తెల్లకోటుకు గడ్డుకాలం – అందని జీతాలు… రోడ్డునపడ్డ బతుకులు

సహనం వందే, హైదరాబాద్: రోగులకు ప్రాణం పోసే వైద్యుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం దెబ్బకు తెలంగాణ గడ్డపై వైద్య వ్యవస్థ కునారిల్లుతోంది. అహోరాత్రులు శ్రమిస్తున్నా అందని జీతాలు… పదోన్నతులు లేని సర్వీసులతో డాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ దుస్థితిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సమరశంఖం పూరించింది. ఈ మేరకు శనివారం వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీతాల కోసం నిరీక్షణతెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో…

Read More
Delhi - Hyderabad - India capital Issue

ఢిల్లీకి గుడ్ బై… దక్షిణాదికి జై – రాజధాని హోదాపై రగులుతున్న కొత్త రచ్చ

సహనం వందే, బెంగళూరు: భారతదేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఒకప్పుడు వైభవం చాటిన దేశ రాజధాని… నేడు భయం, విషపూరిత గాలికి చిరునామాగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న ఒక ఢిల్లీ యువతి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాజధానిగా ఢిల్లీ అర్హతను ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. వైరల్ వార్.. రాజకీయ జోరుఢిల్లీలో గాలి పీల్చడమే ఒక సాహసంలా మారిపోయింది. ప్రతి ఏటా…

Read More
Outsourcing employees

వెట్టికి వెల లేదు… చాకిరికి విలువ లేదు – ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బతుకు దయనీయం

సహనం వందే, హైదరాబాద్: అనేక ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పనులన్నీ భుజాన వేసుకుని నడిపిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస ప్రయోజనాలు అందక ఏజెన్సీల దోపిడీకి గురవుతూ వారు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ వెతలపై ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ నిర్వహించిన పోలింగ్ లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. సగం మందికి పైగా వేతన వివక్ష…ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో సగం మంది తీవ్రమైన వేతన…

Read More